నాలుగు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

Date:11/09/2020

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

పేదలకు ఉచిత వైద్య అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని అమలు చేయని తెలంగాణ, ఒడిశా,
ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడం లేదంటూ దాఖలైన పిటీషన్‌ను విచారణకు
స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.దేశంలోని పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం కోసం కేంద్రం 2018లో ఆయుష్మాన్
భారత్ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం పరిధిలోకి 50 కోట్ల మంది వస్తారు. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించే ఈ పథకం కింద
కరోనాకు కూడా చికిత్స అందిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలోనూ అమలు చేయాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది.ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య
శ్రీ పథకం ఎన్నో రెట్లు మెరుగైందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కేసీఆర్ సర్కారు ఇటీవలే కరోనా చికిత్సను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చింది.

 

 

 

Tags:Supreme notices to four states

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *