Natyam ad

CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం) షూటింగ్లో జాయిన్ అయిన సురేష్ కొండేటి

హైద్రాబాద్ ముచ్చట్లు:

వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బేనర్ పై బొల్లా రామకృష్ణ నిర్మాతగా రమణారెడ్డి  కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తూ డైరెక్షన్ చేస్తున్న సినిమా CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం). ఈ CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం) సినిమా ఈ మధ్యనే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో సీఎంగా అజయ్, సీఎం పెళ్లాంగా ఇంద్రజ, హోమ్ మినిస్టర్ గా సురేష్ కొండేటి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో సురేష్ కొండేటి జాయిన్ అయ్యారు. హోం మంత్రి పాత్రలో నటిస్తున్న ఆయన సెట్స్ లోకి వెళుతున్న వీడియోలు ఫోటోలు తాజాగా మీడియాకు విడుదల చేశారు. అవన్నీ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో సురేష్ కొండేటి అంటే వైరల్ వైరల్ అంటే సురేష్ కొండేటి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఆయన లేని ప్రెస్మీట్లో కూడా ఆయన ప్రస్తావన తీసుకొస్తూ ఆయన పేరుని థంబ్ నైల్స్ గా కూడా వాడేస్తున్నారు.  సీనియర్ హీరో సుమన్ మరియు ఘర్షణ శ్రీనివాస్ ఒక కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాలో నగేష్, కోటేశ్వర రావు, భరత్, ప్రీతి నిగం, రూపాలక్ష్మి, ప్రజ్ఞ, స్వాతి, దాసరి చలపతి రావు, బేబీ హర్షిత, సత్యనారాయణ మూర్తి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ అన్నీ రమణారెడ్డి బాధ్యత వహిస్తున్నారు. సంగీతం ప్రిన్స్ హనీ, డీఓపీ నాగ శ్రీనివాసరావు, ఎడిటర్ రామారావు, ఆర్ట్ రామకృష్ణ, స్టిల్స్ శ్రీనివాస్ రెడ్డి, అంజన్ కుమార్ నిర్మాణ సారథ్యంలో నిర్మాత బొల్లా రామకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
నటీనటులు: అజయ్, ఇంద్రజ, సుమన్, ఘర్షణ శ్రీనివాస్, సురేష్ కొండేటి, నగేష్, కోటేశ్వర రావు, భరత్, ప్రీతి నిగం, రూపాలక్ష్మి, ప్రజ్ఞ, స్వాతి, దాసరి చలపతి రావు, బేబీ హర్షిత, సత్యనారాయణ మూర్తి  తదితరులు నటిస్తున్నారు.

 

Post Midle

Tags: Suresh Kondeti joined the shooting of CM Pellam (Common Man Pellam).

Post Midle