Natyam ad

 మిగులు..తగులైంది…

హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ధనిక రాష్ట్రం. గడచిన ఎనిమిదేళ్ళలో ఆర్థిక ప్రగతి బాటాలో పరుగులు తీస్తున్న రాష్ట్రం. ఆర్థిక వృద్ది రేటులో  నెంబర్ వన్ స్టేట్ .తలసరి ఆదాయంలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం. మరి అప్పుల విషయం ఏమిటి? అందులోనూ తగ్గేదే లే’… అప్పుల పద్దు కూడా పైపైకి పాకి పోతూనే వుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి, రాష్టం అప్పు రూ.2,85,120 కోట్లు.ఇది ఎవరో ఏ ప్రతిపక్ష నాయకుడో , ఏ పనికి మాలిన సన్నాసో చెప్పిన లెక్కలు కాదు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర శాసన సభకు సమర్పించిన 2022-23 బడ్జెట్ పద్దులో చూపిన లెక్క. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) లో బడ్జెట్‌ పరిధిలో మరో రూ.59,672 కోట్ల రుణాన్ని సమీకరించాలని మంత్రి ప్రతిపాదించారు. అంటే 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పరిధిలో చేసిన అప్పు మొత్తం రూ.3,29,980 కోట్లు అవుతుంది. ఇందుకు అదనంగా రూ.1,45,456 కోట్లకు మేర రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు రుణాలు ఉండనే ఉన్నాయి. ఈ అప్పులన్నీ కలిపి రాష్ట్ర రుణం మొత్తం రూ.4,75,444 కోట్లకు చేరుకోనుంది.ఆరేళ్ల లెక్కలు పరిశీలిస్తే 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.29 లక్షల కోట్ల అప్పు ఉంది. 2021–22 ముగిసేనాటికి ఇది రూ.2,85,120 కోట్లకు చేరనుంది. అంటే ఆరేళ్లలో రాష్ట్రంపై పెరిగిన అప్పుల భారం అక్షరాలా రూ.1.57 వేల కోట్లుగా ఉంది. దీన్ని బట్టి తెలంగాణలో ఒక్కొక్కరిపై తలసరి అప్పు రూ.1,25,116కి చేరుకోనుంది.ఇక ఈ ఏడాది ప్రతిపాదించిన అప్పుల్లో.. నీటిపారుదల శాఖకు రూ.8,940 కోట్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.7,267 కోట్లు, గృహనిర్మాణానికి రూ.1,528 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.1,472 కోట్లు, రోడ్డు రవాణాకు రూ.1,221 కోట్లు, పశుసంవర్ధకశాఖకు రూ.797 కోట్లు, వైద్యఆరోగ్యానికి రూ.720 కోట్లు, విద్యుత్తు ప్రాజెక్టులకు రూ.374 కోట్లు, ఇతర పరిశ్రమలకు రూ.254 కోట్లు,, మత్స్య రంగానికి రూ.127 కోట్లు, వివిధ సాధారణ సేవలకు రూ.103 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల రుణాలకు రూ.97 కోట్లు, పాడి అభివృద్ధికి రూ.83 కోట్లు ఉన్నాయి. అంతర్గత రుణాలు రూ.8,700 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నవి రూ.438 కోట్లుగా ప్రతిపాదించారు.
 
Tags:Surplus..done …