Natyam ad

55 లక్షల విలువైన పోయిన సెల్ ఫోన్లు అప్పగింత    

కాకినాడ ముచ్చట్లు:

వివిధ కారణాలతో పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్ఫోన్లకు సంబంధించి ఫిర్యాదులు తీసుకుని వాటిలో కొన్నింటిని మొబైల్ ట్రాక్ ద్వారా రికవరీ చేసి సెల్ఫోన్ యజమానులకు అప్పగించామని, అలాగే సెల్ ఫోన్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు.
శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసులు చేపట్టిన మొబైల్ ట్రాక్ ద్వారా పోగొట్టుకున్న సెల్ఫోన్లను సేకరించి వాటిని తిరిగి ఆ ఫోన్ యజమానులకు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. సెల్ఫోన్ పోయిన మరుక్షణమే 94906 17852కి ఫోన్ ద్వారా లేదా (http://www.ceir.gov.in)లో తెలియజేయాలని ఎస్పీ సూచించారు. ఈ మొబైల్ టాక్ సిస్టమును ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించామని ఇందులో మొదటి విడతగా 90, రెండో విడత 249, మూడో విడత 231, శనివారం 55లక్షల విలువ గల 275 ఫోన్లతో కలిపి మొత్తం 835 సెల్ ఫోన్లను రికవరీ చేసి వాటిని యజమానులకు అందించామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు.   ఈ సమావేశం జిల్లా అదనపు ఎస్పి పి శ్రీనివాస్, మరో అదనపు ఎస్పి ఎంకటేశ్వరరావు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు, కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ సిహెచ్ రామకోటేశ్వర్రావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ పి ఈశ్వరుడు, ఐటీ కోర్ ఎస్సై డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Surrender of lost cell phones worth 55 lakhs

Post Midle