Natyam ad

మీ ప్రలోబాలకు లొంగం ఆరణి నిజమైన భూమన అభిమానులం

-వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం

-వై ఎస్ ఆర్ టీ యూ సి జోనల్ ఇంచార్జి నారపరెడ్డి రాజారెడ్డి.

 

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

మీ ప్రలోబాలకు లొంగే వారము కాదని నిజమైన భూమన అభిమానులం, వై ఎస్ ఆర్ పార్టీ నాయకులమని వై ఎస్ ఆర్ టి యూ సి జోనల్ ఇంచార్జి నారపరెడ్డి రాజారెడ్డి ఉద్ఘటించారు.బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో అభ్యర్థిలేనట్లు చిత్తూరు నుండి దిగుమతి చేసుకొని తిరుపతిని కలుషితం చేస్తున్నారని చిత్తూరు రౌడీ సంస్కృతిని తిరుపతిలో ప్రవేశపెడుతున్నారని తిరుపతి వాసులు రౌడీ సంస్కృతికి వ్యతిరేకిస్తారని అన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులని కార్యకర్తలని ప్రలోభ పెడుతూ జనసేన పార్టీకి ఓటు వేసి నన్ను పిలిపించాలని ప్రలోభ పెడుతున్నారని నాకు కూడా అనేకసార్లు ఫోన్ చేసి ఓటు వేయమని వేయించారని ప్రలోభ పెట్టారని తెలిపారు. ఇలాంటి ప్రలోభాలు లొంగనని భూమన ఫ్యామిలీ కోసం సైన్యంలా పని చేస్తామని చెప్పానని తెలిపారు. రాజారెడ్డికి ఆరని శ్రీనివాస్ ఫోన్ చేసి ప్రలోపెట్టిన ఆడియోని విలేకరులకు వినిపించారు.

 

 

భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్ టీటీడీలో కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వివిధ శాఖల్లో పని చేస్తున్న సొసైటీలకు చెందిన 15000 మంది ఉద్యోగులకు 5000 రూపాయలు నుండి 25 వేల రూపాయలు వరకు జీతం పెంచారన్నారు. తిరుమలలో కళ్యాణ్ కట్ట లో పని చేస్తున్న పీస్ రేట్ క్షరకులకు 850 మందికి 20 వేల రూపాయలు జీతం పెంచుతూ తీర్మానించారు. కార్పొరేషన్ ఉద్యోగులకు రెండు లక్షల బీమా కల్పించారు. టీటీడీ ఆసుపత్రిలో నగదురహిత ఉచిత వైద్యం అందించారు. స్వామి దర్శనానికి గుర్తింపు కార్డులు మంజూరు చేశారు, టీటీడీ ఉద్యోగుల క్యాంటీన్లో రాయితీతో కూడిన అల్పాహారం భోజనం సౌకర్యం కల్పించారు, క్షురకులకు ఎన్నికల నియమావులకి ముందు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుంటే వారికి ఆ జీతం ఇవ్వకుండా కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు కోర్టుకు వెళ్లి కోర్టు నుంచి వీరికి వ్యతిరేకంగా ఆర్డర్ చేసుకొని రాగా సంబంధిత ఉన్నత అధికారులు సమీక్షించి కొత్త జీతాలు కోసం ఎలక్షన్ కమిషన్ అనుమతితో జీతాలు ఇవ్వడం జరుగుతున్నదని ఆరని శ్రీనివాస్ పై టీటీడీ కార్మికులు రగిలిపోతున్నారన్నారు.

 

 

 

టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులకు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలని కేటాయించడం జరిగింది.
భూమన అభినయ్ తిరుపతి లో 20 మాస్టర్ ప్లాన్ రోడ్లను వేయగా భవిష్యత్తులో ఇంకా 14 మాస్టర్ రోడ్డు సిద్ధం చేశారు శెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరించారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్రీ లెఫ్ట్ రోడ్లని వేయించారు కొర్లగుంట ఇరుకు రోడ్డు గా ఉంటే 60 అడుగుల రోడ్డుగా విస్తరణ చేసి ప్రజల మన్నన పొందుతున్నారు. ఇటువంటి అభివృద్ధి చేసే అభ్యర్థి కావలెనా లేక డబ్బుతో, మందుతో ఓటర్లను కొని పారేసే ఆరని శ్రీనివాసులు కావాలేనా? కోట్ల రూపాయలు డబ్బులు మద్యం రౌడీయిజం ఇలా అన్ని అసాంఘిక శక్తులు వడ్డీ పోలింగ్ రోజు తిరుపతి నగరంలో భయానక వాతావరణం సృష్టించి గెలవాలని అరణి శ్రీనివాసులు ప్రయత్నింస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో అలవి గాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నదని.

 

 

 

జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల వల్ల ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని ప్రకటించి రెండు నెలలు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కన్నా రెట్టింపుగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే మరొకసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని తిరుపతి అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యే కావాలని అన్నారు. తిరుపతి శాసనసభ అభ్యర్థి భూమన అధినే రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి మధ్యలో గురుమూర్తికి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో నాయకులు షేక్ మహమ్మద్ రఫీ తిరుమలరెడ్డి రాగాల చంద్రశేఖర్ వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Surrender to your temptations Arani are true Bhumana fans

Post Midle