గ్రామ స్థాయిలో గల సర్వైలెన్స్ టీమ్ లు పటిష్టంగా పని చేయాలి

– మండలాల వారీగా రిలీఫ్ క్యాంప్ లలో గల ఇతర రాష్ట్రాలకు చెందిన వారి వివరాల సమగ్ర నివేదికను వెంటనే పంపండి

Date:23/05/2020

చిత్తూరు  ముచ్చట్లు:

గ్రామ స్థాయిలో గల సర్వైలెన్స్ టీమ్ లు పటిష్టంగా పని చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త తహశీల్దార్లను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉండే సర్వైలెన్స్ టీమ్ లు సమర్థవంతంగా పని చేయడం ద్వారా కోవిడ్ – 19 ను నియంత్రణకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాకు స్టేట్ బార్డర్లుగా గల తమిళనాడు, కర్ణాటక లుగా కలవని, ఇక్కడ గల చెక్ పోస్ట్ ల వద్ద పటిష్టమైన చర్యలు చేపడుతూ జిల్లా లోకి వచ్చే వారికి స్వాబ్ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కు పంపడం జరుగుతున్నదని తెలిపారు. తహశీల్దార్లు వారి మండలాల పరిధిలో గల రిలీఫ్ క్యాంపుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎంత మంది ఉన్నది పూర్తి నివేదికను పంపాలని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతంలో ప్రైమరీ కాంటాక్ట్ వారికి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కి పంపుతున్నామని, సెకండరీ కాంటాక్ట్ వారిని పరీక్షలు నిర్వహించిన అనంతరం వారి గృహం నందు ప్రత్యేక గది ఉన్నట్లైతే హోమ్ క్వారంటైన్ నందు ఉంచేందుకు గల అవకాశాలను పరీశించాలన్నారు. పి హెచ్ సి స్థాయిలోనే స్వాబ్ పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

 

 

 

మామిడి మండీలలో పని చేసే వారికి పూల్ సాంప్లింగ్ చేయాలని ఇతర దేశాలు, రాష్ట్రాల నుండి ప్రత్యేక విమానాల ద్వారా జిల్లాకు చేరుకుంటున్న వారందరికీ స్వాబ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని, మన జిల్లా వాసులను పరీక్షల అనంతరం క్వారంటైన్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. రెడ్ జోన్ పరిధిలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి నెగెటివ్ గా ఫలితాలు వచ్చిన అనంతరం కంటైన్మెంట్ జోన్ ను తగ్గించుకోవాలని తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెన్నై, మహారాష్ట్ర, గుజరాత్ ల నుండి వచ్చే వారికి ఖచ్చితంగా స్వాబ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కేంద్రం నుండి జెసి డి.మార్కండేయులు, ఏజెసి చంద్రమౌళి, సంబంధిత మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.

టిటిడి తిరుపతి జేఈవో బసంత్ కుమార్ ఇంట్లో చోరీ

Tags: Surveillance teams at the village level must work tightly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *