ఏకే ఆంటోనిని కలిసిన సర్వే సత్యనారాయణ

Survey of Satyanarayana who met Antony

Survey of Satyanarayana who met Antony

Date:10/01/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కాంగ్రెస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ ఏకే ఆంటోనిని కలిశారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాపై చేసిన వ్యాఖ్యలు ఉత్తమ్‌, కుంతియా తప్పిదాలను ఆంటోనీకి వివరించారు. సర్వే మీడియాతో మాట్లాడుతూ  ఏఐసీసీ సభ్యుడిగా ఉన్న తనపై క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ఉత్తమ్‌కు లేదన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో డబ్బులు దండుకుని పక్షపాతంగా వ్యవహరించారని సర్వే వ్యాఖ్యానించారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చర్యలతో తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, తెజస అధ్యక్షుడు కోదండరాం అభాసుపాలయ్యారని దుయ్యబట్టారు. ఇబ్రహీంపట్నంలాంటి స్థానాల్లో సమర్థులకు టికెట్‌ కేటాయించకుండా పార్టీకి నష్టం చేశారన్నారు. పార్టీకి నష్టం చేసిన ఉత్తమ్‌పైనే చర్యలు తీసుకోవాలని ఆంటోనీని కోరినట్లు సర్వే సత్యనారాయణ తెలిపారు. ఆరోపణలన్నీ రాతపూర్వకంగా ఇవ్వాలని ఆంటోనీ చెప్పారని సర్వే మీడియాకు తెలిపారు.
Tags:Survey of Satyanarayana who met Antony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *