వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంభానికి సర్వేయర్లు చేయూత

– వెంకటరమణ మృతిపట్ల నివాళులు
– సమాజసేవలో ఆదర్శంగా సచివాలయ ఉద్యోగులు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ కార్యకర్త మడుకూరుకు చెందిన కె. వెంకటరమణ కుటుభానికి గ్రామ సచివాలయ సర్వేయర్ల సంఘం చేయూతనిచ్చి మానవత్వానికి ఆదర్శంగా నిలిచిన సంఘటన సోమవారం చోటు చేసుకొంది. పరికిదొన పంచాయతీ మడుకూరుకు చెందిన వెంకటరమణ గతనెలలో కరోనా తో చికిత్సపొందుతూ తిరుపతి రూయాలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఒక్క గాన ఒక కుమారుడు మృతిచెందడంతో తల్లి వెంకటలక్ష్మమ్మ ఒంటరిగా మిగిలింది. వృధ్దాప్యంలో ఉన్న ఆమెకు కుటుంబ పోషణ భారంగా మారడంతో విషయాన్ని గుర్తించిన గ్రామ సచివాలయ సర్వేయర్ల సంఘం మండలాధ్యక్షుడు పి.మురళీకృష్ణ ఆధ్వర్యంలో సహచర సర్వేయర్లు కలిసి బియ్యం బస్తా, నిత్యవసర సరుకులు అందజేశారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు ప్రభుత్వ సేవలతోపాటు సమాజ సేవలోను పాల్గొంటామన్నారు. ఆమెకు ఏ కష్టవెహోచ్చినా మేము అండగా ఉంటూ ఆదుకొంటామని భరోసా కల్పించారు. ఇలాంటి సంఘటనలు మండలంలో ఎక్కడ ఉన్నా ఆదుకొని తమ వంతు సహాయ సహకారాలు అందించి సమాజ సేవలో మేము ఉన్నామని, విశ్వాసం కల్పించి ప్రభుత్వానికి మంచిపేరు తేవడానికి పనిచేస్తామని చెప్పారు.అనంతరం వెంకటరమణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరికిదొన విఆర్వో ప్రసాద్‌, సర్వేయర్లు మధు, మోహన్‌, మణి, నీలిమ, పద్మజ, శారద,సింధూజ, చంద్రశేఖర్‌,విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Surveyors to the YSRCP activist family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *