Natyam ad

వైసీపీకు ఎడ్జ్ అంటున్నసర్వేలు

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఎన్నికల నగారా మోగనుంది. గెలుపు కోసం అన్ని రాజకీయ పక్షాలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. అస్త్ర శాస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. తమదే గెలుపు అని నమ్మకం పెట్టుకున్నాయి. ఈ తరుణంలో మరో సర్వే వెలుగులోకి వచ్చింది. ఏపీలో ఏ పార్టీకి బలం ఉందన్నది తేల్చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అత్యధిక స్థానాలు దక్కుతాయో అన్న విషయం స్పష్టంగా చెప్పుకొచ్చింది. అదే సమయంలో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని కూడా ప్రకటించింది.వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి నడవాలనుకుంటున్నాయి. వైసిపి మాత్రం ఒంటరి పోరుకే సిద్ధమవుతోంది. బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు ఎవరితో జత కడతాయో ఎన్నికల ముంగిట తేలనుంది. ప్రస్తుతానికి టిడిపి, జనసేన కూటమి కడతాయని తెలుస్తోంది. అందులో బిజెపి చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వై నాట్ 175 అన్న నినాదంతో వైసిపి ముందుకు సాగుతోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఏపీ పై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అటు వామపక్షాలు సైతం బిజెపిని విడిచిపెడితే టిడిపి, జనసేన కూటమి వైపు వచ్చేందుకు సిద్ధపడుతున్నాయి.

Post Midle

ఇటువంటి తరుణంలో వస్తున్న సర్వేలు సంచలనం సృష్టిస్తున్నాయి.తాజాగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ పోల్ స్కాన్ పేరుతో సర్వే చేపట్టింది. డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి ఉందని తెలుసుకునే ప్రయత్నం చేసింది. మొత్తం 2లక్షల 57 వేల శాంపిళ్లను సేకరించింది. ప్రభుత్వ పాలన, ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గ స్థితిగతులు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న ఈ సంస్థ ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించింది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఈ సర్వే చేసినట్లు చెప్పుకొస్తోందిఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వే తేల్చి చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 113 నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉందని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఆ స్థానాల్లో గెలుపొందడం ఖాయమని స్పష్టం చేసింది. 46 నియోజకవర్గాల్లో వైసీపీకి ఓటమి తప్పదని తేల్చేసింది. మరో 16 నియోజకవర్గాల్లో వైసీపీకి, టిడిపి, జనసేన కూటమికి బిగ్ ఫైట్ ఉంటుందని తేల్చి చెప్పింది. 50.10 శాతం ఓట్లతో వైసిపి ముందంజలో ఉంటుందని.. 43.12 శాతం ఓట్లతో టిడిపి జనసేన తరువాత స్థానంలో నిలుస్తాయని చెప్పుకొచ్చింది. ఇక జాతీయ పార్టీలు అయిన బిజెపి, కాంగ్రెస్ లు టు పాయింట్ జీరో ఎయిట్ శాతానికి పరిమితమవుతాయని ఈ తాజా సర్వే తేల్చేసింది. వైసీపీ విజయం ఖాయమని సర్వే చెప్పడంతో.. ఆ పార్టీ శ్రేణులు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.

గుంభనంగా  పార్టీలు
ఒక్క రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మిగతా నాలుగు రాష్ట్రాలను బిజెపి కైవసం చేసుకుంది. అయితే ఏపీలో రాజకీయ పక్షాలు ఈ ఫలితాలపై స్పందించడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ విజయం పై వైసీపీ, టిడిపి, జనసేన నోరు మెదపకపోవడం విశేషం. ముఖ్యంగా ఏపీలో జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్తాయి అన్న దానిపై చర్చ నడుస్తోంది.వైసిపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. తెలుగుదేశం,జనసేన మధ్య పొత్తు కుదిరింది. అయితే ఏపీలో బిజెపి ఎవరితో కలిస్తే అవతల పార్టీతో కాంగ్రెస్ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో బిజెపి వ్యూహం ఏంటి? ఎవరికి సహకరిస్తుంది? మరెవరిని టార్గెట్ చేస్తుంది? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్నటివరకు బిజెపి కోసం ఆరాటపడిన చంద్రబాబు.. ఇప్పుడు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. పవన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిజెపి వస్తుందని చెబుతున్నారు.కర్ణాటక గెలిచిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణలో సైతం బాగా వేసింది. అయితే తన చేతిలో ఉన్న చత్తీస్గడ్, రాజస్థాన్లను మాత్రం కోల్పోయింది. దీంతో బిజెపి, కాంగ్రెస్ లకు ఇవి మిశ్రమ ఫలితాలే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామని బిజెపి నేతలు సంకేతాలు పంపుతున్నారు. కానీ ఏపీ విషయంలో ఎలా ముందుకు వెళ్తారు అన్నది ఇప్పుడు ప్రశ్న. అయితే మొన్నటి వరకు ఏపీలో ఏ పార్టీ గెలిచినా తమకు మద్దతుని ఇచ్చే వ్యూహాన్ని బిజెపి అమలు చేసింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి ఎలా ముందుకెళుతుందన్నదానిపై చర్చ నడుస్తోంది.అయితే ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు బిజెపి పై ఆగ్రహంగా ఉన్నాయి. చంద్రబాబును అరెస్టు చేయించి బలహీనపరిచే ప్రయత్నం జరిగిందన్న అనుమానం ఉంది.టిడిపి,జనసేన కూటమిలోకి బిజెపి వస్తే ఓటమి తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అదే బిజెపి విడిగా పోటీ చేస్తే టిడిపి, జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బిజెపి విడిగా పోటీ చేసి వైసిపికి లోపాయికారిగా సహకరిస్తుందా? లేకుంటే టీడీపీ, జనసేన కూటమికి సహకరిస్తుందా అన్నది చూడాలి. అయితే బిజెపి పాత్ర బట్టి.. ఏపీలో కాంగ్రెస్ వ్యూహం అనుసరించే అవకాశం ఉంది. మరి బిజెపి ఎలా ముందుకెళ్తుందో? కాంగ్రెస్ ఎటువైపుకు వెళ్తుందో? చూడాలి.

Tags: Surveys give edge to YCP

Post Midle