ప్రాణాలు తీసినకరెంట్ బిల్లు

Date:10/08/2020

ముంబాయి ముచ్చట్లు:

కరోనా కాదు కరెంట్ బిల్లు కూడా ప్రాణాలు తీస్తుంది. అదేంటి ..అని అనుకుంటున్నారా? నిజమే కరోనా మహమ్మారి కంటే ఈ కరోనా కాలంలో వచ్చే కరెంట్ బిల్లులే షాక్ ఇస్తుంది. వందల్లో రావాల్సిన కరెంటు బిల్లులు… వేలు లక్షల రూపాయల్లో వచ్చి సామాన్యులను భయపెట్టిన ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి. సిబ్బంది నిర్లక్ష్యం సాంకేతిక తప్పిదాల కారణంగా అప్పుడప్పుడు విద్యుత్ బిల్లులు సామాన్యులకు షాక్ ఇస్తుంటాయి. వందల్లో రావాల్సిన కరెంటు బిల్లులు… వేలు లక్షల్లో వచ్చి సామాన్యులకి చుక్కలు చూపిస్తుంటాయి. అయితే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో మాత్రం ఈ రకమైన ఓ విద్యుత్ బిల్లు చూసి ఏకంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.పూర్తి వివరాలు చూస్తే .. మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో లీలాధర్ లక్ష్మణ్ అనే 57 ఏళ్ల వ్యక్తి ఇంటికి గత వారం కరెంట్ బిల్లు ఏకంగా రూ. 40000 వచ్చింది. ఒక్కసారిగా కరెంట్ బిల్లు 40 వేలు రావడంతో ఆ వ్యక్తి అప్పటినుండి ఆందోళన చెందుతున్న లక్ష్మణ్.. రెండు రోజుల క్రితం తన నివాసంలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ విషయంలో ఆందోళన వద్దని తాము చెప్పినా.. లక్ష్మణ్ వినలేదని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. కరెంట్ బిల్లు ఎక్కువగా రావడంతో ఆ బిల్లు చూసి భయపడిన ఆ వ్యక్తి మద్యం మత్తుల ఒంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకొని ఆత్మహత్య కి పాల్పడ్డాడు.  బాధితుడి చనిపోయిన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..విచారణ చేపట్టారు.

 

 

 ప్రైవేట్ టీచర్స్ ని ఆదుకున్న విద్యార్థి

Tags:Survivors current bill

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *