జగన్ పాత్రలో సూర్య…?

Surya in the role of Jagan?

Surya in the role of Jagan?

Date:17/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ‘యాత్ర’లో ఆయన తనయుడు వైఎస్ జగన్ పాత్ర కోసం నటుడి ఎంపిక వ్యవహారం ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ పాత్ర విషయంలో ఇప్పటికే పలు పేర్లు వినిపించాయి. తమిళనటుడు సూర్య వైఎస్ జగన్ పాత్రను చేయబోతున్నాడని మొదట ఆపై సూర్య తమ్ముడు కార్తీ ఆ పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. అవేవీ నిజం కాలేదు ఇంత వరకూ.
అదలా ఉంటే ఇటీవలే విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది. జగన్ పాత్రను విజయ్ చేస్తాడని వెబ్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. ‘యాత్ర’ యూనిట్ ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. అదలా ఉంటే.. ఇప్పుడు ఈ పాత్ర విషయంలో మరో పేరు కూడా వినిపిస్తోంది.
దుల్కర్ సల్మాన్‌ను జగన్‌గా చూపించాలని ‘యాత్ర’ రూపకర్తలు భావిస్తున్నారట. తండ్రి పాత్రలో మమ్ముట్టీ, తనయుడి పాత్రలో దుల్కర్‌లో నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. అయితే దీనికి మమ్ముట్టీ ఆమోదం తెలపలేదని సమాచారం.
ఈ మేరకు ప్రచారం జరుగుతోంది.ఓవరాల్‌గా జగన్ పాత్రలో నటింపజేయడానికి తగిన హీరో కోసం ‘యాత్ర’ రూపకర్తల ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయని సమాచారం. ఈ సినిమా జగన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల కాబోతోంది.
Tags:Surya in the role of Jagan?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *