‘స్ప్రైట్’ బ్రాండ్ అంబాసడర్ గా సుశాంత్

Date;27/02/2020

‘స్ప్రైట్’ బ్రాండ్ అంబాసడర్ గా సుశాంత్

వరుస హిట్లతో హీరో సుశాంత్ జోరు మీదున్నారు. తాజాగా ఆయన శీతల పానీయం ‘స్ప్రైట్’తో  వాణిజ్య ప్రకటనల (కమర్షియల్ యాడ్స్) ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. సుశాంత్

ఇప్పుడు ‘స్ప్రైట్’కు బ్రాండ్ అంబాసడర్. ఆ బ్రాండ్ కు ఆయన చేసిన మొదటి కమర్షియ యాడ్ విడుదలైంది. ఇదివరకటి యాడ్స్ తరహాలోనే ఉత్తేజభరితంగా ఉన్న ఈ టీవీ కమర్షియల్ లో

సుశాంత్ ఉబర్ కూల్ లుక్స్ లో కనిపిస్తున్నారు. ‘స్ప్రైట్’కు తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసడర్లుగా వ్యవహరిస్తున్నారు.
హీరోగా ‘చి.ల.సౌసినిమాతో సక్సెస్ సాధించిన సుశాంత్, దాని తర్వాత ఒక కీలక పాత్ర పోషించిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం

ఆయన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే రొమాంటిక్ థ్రిల్లర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు

చంద్రబాబుకు నిరసన సెగ

Tags;Sushant as brand ambassador of ‘Sprite’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *