కాంగ్రెస్ రీ ట్వీట్ తో సుష్మా 

Date:27/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను బీజేపీ ఎంతగా క్యాష్ చేసుకుంటుందో గత నాలుగేళ్లుగా చూస్తూనే ఉన్నాం. నిన్న మొన్నటి దాకా.. నమో యాప్ మీద ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ చివరకు హ్యాకింగ్ భయంతో తన యాప్‌నే డిలీట్ చేసింది. తాజాగా.. సుష్మా స్వరాజ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేల్లా ఓ పోల్ క్రియేట్ చేసి సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఇరాక్‌లో 39 మంది భారతీయుల్ని ఐసిస్ ఉగ్రవాదులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లపాటూ వారి ఆచూకీ దొరకడం లేదని కేంద్రం చెప్పింది.కానీ ఇటీవలే భారతీయులను సమాధి చేసిన ప్రాంతాన్ని కనుగొన్నారు. 39 భారతీయులు ఇరాక్‌లో హత్యకు గురయ్యారని సుష్మా స్వరాజ్ ఇటీవలే ప్రకటించారు. నాలుగేళ్లపాటు విదేశాంగ ఏం చేసిందని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శించింది.ఇరాక్‌లో 39 మంది భారతీయులు మరణం విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ అతిపెద్ద ఫెయిల్యూర్ అని భావిస్తున్నారా? అని ట్వీట్టర్‌లో పోల్ నిర్వహించింది. దీనికి లేదని ఎక్కువ శాతం మంది బదులిచ్చారు. దీంతో ఆ పోల్‌ను సుష్మా రీట్వీట్ చేశారు. ఇది సుష్మాకు నైతిక విజయాన్ని ఇవ్వగా.. ఫెయిల్యూర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లింది. దీన్నే సెల్ఫ్ గోల్ అంటారేమో కదూ..
Tags:Sushma with Congress re-tweet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *