The hardships of Corona victims in rental homes

ఉత్కంఠ!

Date:08/05/2020

ములకలచెరువు ముచ్చట్లు:

ములకలచెరువు చెందిన ఓ డ్రైవర్ కు కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిందన్న సమాచారంతో మండలంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈ డ్రైవర్ గత నెల తమిళనాడులోని కోయంబేడులో పర్యటించాడు. ములకలచెరువు నుంచి ఐషర్ వాహనంలో టమోటా తీసుకెళ్ళేవాడు. ఈ నేపథ్యంలో డ్రైవర్ను పరీక్షలకు తరలించారు. పాజిటివ్ ఫలితం వచ్చింది. దీనిపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోసారి పరీక్ష నిర్వహించగా నెగటివ్ ఫలితం వచ్చింది. ఈ మేరకు ములకలచెరువు డ్రైవర్ కు నెగటివ్ వచ్చినట్లు డిప్యూటీ డిఎంహెఓ డాక్టర్ లోకవర్షన్ తెలిపారు. ఈ వార్త ములకలచెరువు ప్రజలకు ‌పెద్ద రిలీఫ్ వచ్చినట్లుంది. జనం కరోనతో హడలిపోతున్న తరుణంలో నెగటివ్ రావడంతో‌ అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైనా ప్రజలు మరింత అప్రమత్తంగా వ్వవహరించాలని అధికారిక యంత్రాంగం సూచిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండండి

Tags: Suspense!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *