Suspension disturbance in the lotus

 కమలంలో సస్పెన్షన్ కలవరం

Date:10/08/2020

 

విజయవాడ ముచ్చట్లు:

 

ఏపీలో బీజేపీ ఏం జరుగుతోంది? పార్టీ సారథ్యం స్వీకరించాక సోము వీర్రాజు తన ప్రతాపం చూపుతున్నారా? గతంలో అమరావతికి అనుకూలంగా వున్న నేతలు మాట్లాడితే వారు గొంతుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో బీజేపీ నేత సస్పెన్షన్ కు గురయ్యారు.
ఏపీ రాజధాని అమరావతికి అనుకూల మాట్లాడినవారిని అధినేత ఉపేక్షించడంలేదు. వారిని బీజేపీ చీఫ్ నిర్ధాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తున్నారు. మూడు రాజధానులపై ఒక పత్రికకు ఎడిటోరియల్ రాశారన్న కారణంతో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓవీ. రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నేతపై వేటు పడింది. రాజధానికి అనుకూలంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణను బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సస్పెండ్ చేశారు.

బీజేపీపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ‘అమరావతి రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మీరు చేసిన వ్యాఖ్యలు ఆమోద యోగ్యం కాదు. రాష్ట్ర రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి పాత్ర లేదని పార్టీ అధికారికంగా తెలిపింది. కానీ పార్టీ అభిప్రాయానికి మీ ప్రకటనలు పూర్తిగా వ్యతిరేకం. పార్టీ.. రైతుల పక్షాన నిలబడటం లేదని మీ ఆరోపణ నిరాధారమైనది. పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. అనేక వార్తాపత్రికలు మరియు టెలివిజన్ ఛానెల్స్ మీ తప్పుడు ఆరోపణలకు విస్తృత ప్రచారం ఇచ్చాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అధ్యక్షుల సూచనల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం’ అంటూ లేఖలో సోము వీర్రాజు స్పష్టం చేశారు.
గతంలో కన్నా లక్ష్మీనారాయణ అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే సోము వీర్రాజు మాత్రం బీజేపీ వైఖరిని మార్చేశారని. జనసేనతో కలిసి ఉద్యమం చేస్తామని ప్రకటించి జై అమరావతి అంటే గొంతు నొక్కుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. సోము వీర్రాజు పాలకపక్షానికి మిత్రపక్షంగా మారారని మండిపడుతున్నారు.

 

మూడు నగరాలే… కేసులు..

 

Tags:Suspension disturbance in the lotus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *