కార్పోరేటర్ ప్రధాన అనుచరులపై సస్పెన్షన్ వేటు

Date:28/10/2020

మల్కాజిగిరి ముచ్చట్లు:

వరద భాదితుల కోసం ప్రభుత్వం ఇస్తున్న 10వేల తప్పుదారి పడుతున్నాయి. మల్కాజిగిరి నియోజికవర్గం లోని మౌలాలి డివిజన్ లో స్థానిక టి.ఆర్.ఎస్ నాయకులు ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేసారని కొందరు బాధితుల వీడియో సామాజిక మాధ్యామాలలో వైరల్ కావడంతో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావ్ ఈ విషయంపై స్పందిస్తూ సంభందిత నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తునట్లు తెలిపారు.ఈ విషయంపై మౌలాలి డివిజన్ బి.జే.పి నేతలు స్పందిస్తూ అక్రమాలకు పాల్పడ్డ నాయకులను సస్పెండ్ చేయడమే కాదు వారివెనక ఉన్న వారిపై కూడా చర్యలు చేప్పట్టాలని డిమాండ్ చేసారు . సస్పెండ్ ఐన నాయకులు స్థానిక కార్పోరేటర్ భర్త ప్రధాన అనుచరులు వున్నారు. ఈ అక్రమాల వెనుక ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసారు.

కాంగ్రెస్ నేతపై దాడికి యత్నం

Tags: Suspension hunting on corporator major followers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *