Suspension of TDP members on the first day

మొదటి రోజు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Date:30/11/2020

వాడీ వేడిగా అసెంబ్లీ

విజయవాడ ముచ్చట్లు

ఏపీ అసెంబ్లీ తొలిరోజే వాడీవేడిగా మొదలైంది. మొదటి రోజు సంతాప తీర్మానం తర్వాత బీఏసీ సమావేశం జరిగింది.. అనంతరం పలు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నార వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. అధికారంలోకి రాగానే రైతు పక్షపాతినని సీఎం జగన్‌ ప్రకటించారని గుర్తుచేశారు. రైతులకు ఉచితంగా బోర్లు, మోటార్లు, పైపులు ఇస్తున్నామన్నారు. పంటల కొనుగోలుకు రూ.3,200 కోట్లు కేటాయించామని వెల్లడించారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత మాది. సీఎం జగన్‌ స్వయంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేశారు.ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. ఆ సీజన్‌లోనే పరిహారం ఇవ్వాలనేది సీఎం జగన్‌ ఆదేశం. ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్నాం. ఈ క్రాప్‌లో నమోదు చేసుకుంటే చాలు ఉచిత పంటల బీమా వర్తిస్తుందన్నారు.మంత్రి తర్వాత టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు చర్చలో మాట్లాడారు. రైతుల సమస్యల్ని ప్రస్తావించారు.. పంట నష్టపోయినవారిని ఆదుకోవాలన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్, మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. మంత్రి సమాధానం ఇచ్చినా రామానాయుడు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. టీడీపీ అవగాహన లేకుండా మాట్లాడుతుందని.. డిసెంబర్ నెలాఖరు నాటికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. నెల రోజుల్లోనే ఇన్‌పుట్ సబ్సిడీ అందించే కార్యక్రమం చేస్తున్నామన్నారు. బుర్ర వాడాలంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ-వైఎస్సార్‌సీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. రామానాయుడిపై సీఎం చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఎమ్మెల్యేలతో వెళ్లి స్పీకర్ పోడియం దగ్గర బైఠాయించారు. టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతుంటే చంద్రబాబుకు ఎలా అవకాశం ఇస్తారని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.టీడీపీ పోడియం దగ్గర బైఠాయించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారని.. సీనియర్ నేతగా చెప్పుకునే చంద్రబాబు ఇలా దిగజారి మాట్లాడటం ఏంటని.. రౌడీయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హుందాతనంగా లేదన్నారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకుంటుందని.. వెంటనే మార్షల్స్‌ను తీసుకొచ్చి టీడీపీ సభ్యుల్ని బయటకు పంపి సభను కొనసాగించాలని జగన్ కోరారు. స్పీకర్ పదే పదే టీడీపీ సభ్యుల్ని తమ సీట్లలోకి వెళ్లాలని కోరినా వెనక్కు తగ్గలేదు.. దీంతో ప్రతిపక్ష సభ్యుల్ని (13మందిని) ఒక రోజు సస్పెండ్ చేశారు.

 

చంద్రబాబు సహా నేతల సస్పెండ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సహా పలువురు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ సెషన్ వరకు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేయాలంటూ మోషన్ ప్రవేశపెట్టగా, స్పీకర్ దానికి ఆమోదించారు. దీంతో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయస్వామి, రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, భవానీ, గద్దె రామ్మోహన్‌, జోగేశ్వరరావు, సత్యప్రసాద్‌, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవానీ, పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్ సోమవారం సస్పెండ్ అయ్యారు.తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో స్పీకర్ పోడియం ముందు చంద్రబాబు బైఠాయించి తన నిరసన తెలిపారు. తుఫాను పంట నష్టంపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. సీఎం జగన్ సమాధానంపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత ప్రయత్నించగా.. చంద్రబాబు ఎలా మాట్లాడుతారంటూ అధికార పక్షం అడ్డుకుంది.దీంతో అధికార పక్షం తీరుకు నిరసనగా పోడియం ఎదుట చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వయస్సుకు తగ్గట్టు చంద్రబాబు వ్యవహరించాలని సీఎం అన్నారు. స్పీకర్ చెప్పినా, పోడియం ముందు నుంచి సీట్లలోకి వెళ్లాలని తమ్మినేని సీతారాం పలుమార్లు కోరినా, టీడీపీ ఎమ్మెల్యేలు వినకపోవడంతో వారిని సోమవారం ఒక్క రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు.

జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

Tags:Suspension of TDP members on the first day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *