జిల్లాలో ముగ్గురు తాహసిల్దార్ల సస్పెన్షన్
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.కలువాయి మండలం చవటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సంభందించిన భూసేకరణ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డ నేపథ్యంలో ముగ్గురిపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రస్తుతం గుడ్లూరు లో పనిచేస్తున్న లావణ్య వెంకటాచలంలో పనిచేస్తున్న నాగరాజు తోటపల్లి గూడూరులో పనిచేస్తున్న హమీద్ సస్పెండ్ చేశారు.వీరి స్థానంలో మరొకరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు నెల్లూరు జిల్లాలో ఒకేసారి ముగ్గురు తాహసిల్దార్లను అవినీతి అక్రమాలకు సంబంధించి సస్పెండ్ చేయడం జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది..

Tags: Suspension of three Tahsildars in the district
