దిశ ఘటనపై అనుమానాలు

Suspicions of directional incident

Suspicions of directional incident

Date:11/12/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణకు ప్రతిపాదించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకోసం ఆ విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరును రాష్ట్రమే ఎంపిక చేసి తమను సంప్రదించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.సిట్‌కు నాయకత్వం వహించే విశ్రాంత న్యాయమూర్తి ఢిల్లీలోనే ఉండి విచారణను పర్యవేక్షిస్తారని ఆదేశించింది. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ ఎన్‌కౌంటర్ పిటిషన్ విచారణకు రాగానే కొద్ది నిమిషాల వ్యవధిలోనే ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. తెలంగాణ తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. తమ వాదనలు విన్న తర్వాతే ముందుకు వెళ్లాలని రోహత్గీ ధర్మాసనాన్ని కోరారు. తెలంగాణ హైకోర్టు ఇదే అంశంపై విచారణ జరుపుతున్నందున, ఆ విషయం తమకు తెలుసని ధర్మాసనం వ్యాఖ్యానించింది.దిశ హత్య కేసులో నిందితులైన నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా ప్రదేశానికి నిందితులను తీసుకెళ్లగా, వారు తిరగబడ్డారని ఆత్మ రక్షణ కోసం వారిని చంపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని కొందరు మానవ హక్కుల ఉద్యమ కారులు తెలంగాణ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

 

పాక్ గూఢచారులు దేశంలోకి చొరబడొచ్చు..

 

Tags:Suspicions of directional incident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *