వ్యక్తి అనుమానస్పద మృతి
అన్నమయ్య ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం దేశెట్టిపల్లి గ్రామానికి చెందిన మర్రి కిష్టయ్య( 47) సాయంకాలం ఐదు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. రాత్రి 10 గంటలు దాటిన భర్త కిష్టయ్య ఇంటికి రాకపోవడంతో భార్య సుకన్య చాలాసార్లు ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేయలేదు తెల్లవారేసరికి గ్రామం పక్కనే ఉన్న మామిడి తోటలో శవమై తేలాడు. మామిడి తోటలో మామిడికాయలు కు వెళ్లడంతో తోట యజమానులు కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. లేక ఇంకేమైనా కుట్ర కోణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది. కిష్టయ్య మృతి చెందడంతో నలుగురు పిల్లలు భార్య వీధిన పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్ ను తెప్పించారు.
Tags; Suspicious death of the person

