పుంగనూరులో 17 నుంచి స్వచ్చ అమృత్‌ మహొత్సవం

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు మున్సిపాలిటిలో శనివారం నుంచి స్వచ్చ అమృత్‌ మహొత్సవ కార్యక్రమాలు 15 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌ 2 వరకు ఈ కార్యక్రమాలు జరపనున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా చైర్మన్‌ , వైస్‌ చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు, మహిళా గ్రూపులచే ప్రతి రోజు పట్టణంలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థులు, మహిళా గ్రూపుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం ఇంటింటికి వెళ్లి నిర్వహించడం జరుగుతుందన్నారు. తడిచెత్త, పొడిచెత్త, హానికారిక చెత్తను వేరుచేయడంతో పాటు చెత్త నుంచి ఆట వస్తువులు తయారు చేసే విధానాన్ని వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

 

Tags: Swachha Amrit Mahotsav from 17th in Punganur

Leave A Reply

Your email address will not be published.