తప్పుడు హామిలు ఇస్తున్న దేశం పార్టీకి తాటతీయ్యండి

Swallow the party to the party giving false assurances

Swallow the party to the party giving false assurances

– జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌

Date:14/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

తప్పుడు హామిలతో ప్రజలను మోసగించేందుకు వస్తున్న తెలుగుదేశం పార్టీకి తాటతీసేలా ప్రజలు చైతన్యవంతులు కావాలని వైఎస్సార్‌సీపీ జెడ్పి ప్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌ పిలుపునిచ్చారు. గురువారం ఆయన మండలంలోని పాళ్యెంపల్లె పంచాయతీలో బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో ఇచ్చిన హామిలను నేరవేర్చకుండ 2019 ఎన్నికలకు రెండవ సారి తప్పుడు హామిలతో ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. రైతు రుణమాఫి , డ్వాక్రారుణాలు రద్దు, నిరుద్యోగభృతి, పెన్షన్లు, పక్కా గృహాలు ఎవరికైనా అందిందా అంటు ప్రశ్నించారు. ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండ ఎన్నికల ముందు రెండు నెలల కాలంలో పెన్షన్లు, పసుపు, కుంకుమ పథకం క్రింద నిధులు ఇవ్వడం ఓటర్లను మోసం చేసేందుకేనన్నారు. ప్రజలపై నిజమైన ప్రేమ ఉంటే ఐదేళ్ల పాటు ఎందుకు కొనసాగించలేదని నిలధీశారు. వైఎస్సార్‌సీపీ ప్రకటించిన నవరత్నాలను కాపి కొట్టిన ఘనుడు చంద్రబాబునాయుడు అని ఎద్దెవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగరాజారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, నేతలు సుబ్రమణ్య యాదవ్‌, మురుగప్ప, ప్రభాకర్‌రెడ్డి, గంగిరెడ్డి, కుమార్‌రెడ్డి, బాబు, చంద్ర, రమణ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో…..

పుంగనూరు పట్టణంలోని తూర్పుపాళ్యెం, ఈస్ట్పేట, ఎంబిటిరోడ్డు ప్రాంతాలలో రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారాలు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేసి, ఎమ్మెల్యేగా డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీగా పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, కౌన్సిలర్లు నయాజ్‌, మనోహర్‌, అమ్ము, రేష్మా, మంజుల, ఆసిఫ్‌, నేతలు ఇఫ్తికార్‌, వెంకటేష్‌, మంజు, ఇర్షాద్‌బేగం తదితరులు పాల్గొన్నారు.

 

జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర

Tags: Swallow the party to the party giving false assurances

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *