Swami Darshan following Srikalahasti Lockdown must adhere to government activity regulations,

శ్రీకాళహస్తి లాక్ డౌన్ తరువాత స్వామి దర్శనాలు ప్రభుత్వ సూచించే నిభందనంలు పాటించాలి,

-జిల్లా కలెక్టర్, మరియు అర్బన్ ఎస్.పి.

Date:26/05/2020

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎస్ పి రమేష్ రెడ్డి, పర్యవేక్షించార, అనంతరం శ్రీకాళహస్తి పురపాలక సంఘం లో అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించిన కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, పై విషయాల పై కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎస్ పి రమేష్ రెడ్డి మాట్లాడుతూలాక్ డౌన్ తరువాత స్వామి వారిదర్శనాలు ప్రభుత్వ గైడ్ లైన్స్ తప్పనిసరి పాటించేలా ఏర్పాట్లు వుండాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త ఆలయ ఇఓ చంద్రశేఖర్ రెడ్డి వారికి సూచించారు. సోమవారం రాత్రి శ్రీకాళహస్తి లోని బహదుర్ పేటను అర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి పర్యటించి అక్కడి ప్రజలకు కరోన వైరస్ గురించి అవగాహన కల్పించారు ప్రతిఒక్క వ్యక్తి సామాజికదూరం పాటించాలి అంటు ప్రజలు సూచించారు.

 

కలెక్టర్, అర్బన్ ఎస్.పి. లాక్ డౌన్ తరువాత ఆలయంలోకి భక్త్తులు వెళ్లే మార్గాల ను, క్యూలైన్ లు పరిశీలించారు. లాక్ డౌన్ అనంతరం దర్శనాలు పై ప్రభుత్వ గైడ్ లైన్స్ మేరకే భక్తులను అనుమతించాలని తెలిపారు. ఇఓ వివరిస్తూ ప్రస్తుతం స్వామి వారికి పూజలు కైంకర్యాలు యధాతధంగా జరుగుతున్నాయని అధికార్లుకు వివరించారు. అనంతరం శ్రీకాళహస్తి మునిసిపల్ కార్యలయంలో కమిషనర్ శ్రీకాంత్, ఎం.పి.డి.ఓ బాలాజీ, అధికారులతో జెసి ( అభివృద్ధి) వీరబ్రహ్మం, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ సమీక్షించి . శ్రీకాళహస్తిపట్టణంలో కంటైన్ మెంట్ జోన్స్ లో కొత్తగా నమోదు అయిందని, అక్కడ మరో 600 సాంపిల్స్ సేకరణ చేయనున్నామని అధికార్లుకు ఆదేశాలను జారిచేశారు , శ్రీకాళహస్తిలో రిజల్ట్ ఆదారంగా సడలింపు సమయం పెంపుకు, సడలింపులకు , నిర్ణయం ఉంటుందని తెలిపారు. శ్రీకాళహస్తిలో బస్సులు నడపడంలో ప్రస్తుతం కంటైన్మెంట్ పరిధిలో బస్టాండ్ ప్రాంతం వుందని దశల వారి సడలింపుకు దృష్టి పెట్టనున్నామని తెలిపారు. ప్రస్తుతం ఒక క్లస్టర్ లో కేసులు నమోదు కాలేదని తెలిపారు. పరిస్థితిని బట్టి సడలింపు ఉంటుంది, ప్రజలు సహకరించాలని కోరారు.

ఉపాధికూలీలందరికి పనులు కల్పిస్తాం

Tags: Swami Darshan following Srikalahasti Lockdown must adhere to government activity regulations,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *