చౌడేపల్లి బస్టాండులో స్వామి వివేకానంద జయంతి
చౌడేపల్లి ముచ్చట్లు :
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా “నరేన్ ఫౌండేషన్” వారు చౌడేపల్లి బస్టాండు నందు జాతీయ యువజన దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులైన డా. సురేంద్ర బాబు మాట్లాడుతూ యువత స్వామి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. యువజన నాయకులు యం. ప్రదీప్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతూ గత మూడు సంవత్సరాలుగా నరేన్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న విద్య మరియు వైద్య పరమైన సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా నరేన్ ఫౌండేషన్ అధ్యక్షులు జి. తులసీరామ్ మాట్లాడుతూ మండలంలోని ఉన్నత పాఠశాలల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందిస్తామని తెలిపారు. అంతే కాకుండా ప్రజలకు నిరంతర వైద్య సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ వారు చౌడేపల్లి పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు షాపుల్లో స్వీట్ బాక్సులు మరియు వివేకానందుని గురించిన పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి జి. నరేష్ బాబు, ఉపాధ్యక్షులు రవీంద్ర బాబు, కార్యదర్శి ఎ. సుబ్రమణ్యం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ ఉపాధ్యక్షులు ఉత్తరాది హరిప్రసాద్, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్, బ్యాంక్ రెడ్డెప్ప, కొత్తపల్లి మణి, మోహన్ కుమార్, సహదేవ, దేవేంద్ర, షేరు, ఈశ్వర్, పవన్, రాము, గిరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:Swami Vivekananda Jayanti at Chaudepalli Bus Stand
