బాలిక పై స్వామిజీ  అత్యాచార యత్నం

-ఆలస్యంగా వెలుగు చూసిన వైనం

 

ఆదిలాబాద్ ముచ్చట్లు :

ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలం రాజురా గ్రామంలో ఒక స్వామిజీ మైనర్ బాలికపై ఆత్యాచారయత్నం చేసాడు.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామం సమీపం లో ఉన్న గుట్ట పై నివాసం ఉండే స్వామిజీ జాదవ్ ఆత్మారాం ఆరు సంవత్సరాల క్రితం దుర్గానగర్ తండా సారంగపూర్ మండలం నుండి రాజురా సమీప అడవిలో ఒక  సంవత్సరం పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండేవాడని గ్రామస్తులు అంటున్నారు. స్వామిజీని గమనించిన గ్రామస్తులు ఇతడు దేవుడి స్వరూపం అని నమ్మి 5 సం క్రితం రాజర తండా గుట్టపై ఆయనకు నివాసం కల్పించారు. స్వామిజీ గా అవతారం ఎత్తి చుట్టూ ప్రక్కల గ్రామాల గుడి లో పూజలు చేసేవారు  16 తేదీ నాడు ఐస్ పూర్ గ్రామ గుడిలో అదే గ్రామానికి చెందిన 16 సం అమ్మాయి  స్వామిజీ కి పండ్లు పూలు  ఇవ్వడానికి గుడికి వెళ్ళింది అరగంట అయిన కూతురు రాకపోవడం తో గుడి ప్రక్కన ఉండే గది కి వెళ్లి చూడగా గది కి లోపల నుండి గడియ వేయడం చూసి న తల్లి తండ్రులు తలుపు పగలగొట్టారు అప్పటికే స్వామిజీ అమ్మాయి పై అత్యాచార ప్రయత్నం చేసాడు. వారు రావడం చూసి స్వామిజి  పారి పోయాడు. మంగళవారం నాడు తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు సోలీసులు  కేసు నమోదు చేసారు.

 

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Swamiji attempted to rape a girl

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *