చిత్తడిగా ఉభయ గోదావరి జిల్లాలు

Date:17/10/2020

ఏలూరు ముచ్చట్లు:

ఏపీలో కురిసిన భారీ వర్షాలకు ఉభయ గోదావరి జిల్లాలు చిత్తడిగా మారాయి.పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు, కాళ్ల ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక కాలనీల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఏలూరులో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో  భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి.రహదారులపై నీరు చేరడంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.నర్సాపురం, తాడేపల్లిగూడెం,ఏలూరు పలు ప్రాంతాలలో కుండపోత వర్షాలతో ఎద్దువాగు, జల్లేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

తప్పి పోయిన బాలుడిని తల్లి ఒడికి చేర్చిన అధికారులు

Tags:Swampy dual Godavari districts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *