Swarni, Inspector of Weights and Measures Branch at SP Superstore, Anantapur

మద్యం షాపు ముందు మందుబాబుల పూజలు 

Date:03/05/2020

చిత్తూరుముచ్చట్లు:

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 22 నుంచి మద్యం షాపులు పూర్తిగా బంద్ కావడంలో మందుబాబుల పరిస్థితి ఊహాతీతంగా మారింది. అయితే తాజాగా లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో పాటు.. మే 3 తరువాత గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం షాపులను ఓపెన్ చేసుకోవచ్చవంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మద్యం ప్రియుల సంతోషం అంతా ఇంతా కాదనే చెప్పాలి. సుమారు 45 రోజులుగా మద్యం లేక అల్లాడిపోయిన మందుబాబులకు మళ్లీ రేపటి(సోమవారం) నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయనే వార్త వారి మొహాల్లో కోటికాంతులు వెలుగు చూస్తున్నాయి.

 

 

 

కరోనా లాక్ డౌన్ తో మద్యం లేక గిలగిలా కొట్టుకుంటున్న మందుబాబుల ప్రాణాలు, కరోనా వైరస్ తో ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియదు కానీ.. ఇక కరోనా వచ్చినా వంద సంవత్సరాలు గ్యారెంటీగా బతికేస్తామన్న ఆనందం మందుబాబులకు మద్యం షాపులు తెరుచుకోవడమనే వార్త వారిలో కోటి ఆశలు నింపింది.మద్యం ప్రియుల సంతోషానికి అద్దంపట్టే ఘటన జిల్లా సరిహద్దుల్లో చోటుచేసుకుంది. రేపు మద్యం షాపులు తెరుస్తారని ప్రకటన రావడంతో కుప్పం సరిహద్దు ప్రాంతం కర్నాటకలోని బంగారుపేట వద్ద వింత ఘటన చోటుచేసుకుంది.

 

 

 

కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటక లోని బంగారుపేట తాలూకా బుది కోట వద్ద ఒక మద్యం షాపు వద్ద మద్యం ప్రియుడు కొబ్బరికాయ కొట్టి హారతులిచ్చాడు. ఇది చూసి అంతా విస్తు పోతున్నారు. కరోనా మహమ్మారి మొదలైనప్పట్నుంచి ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో అన్ని మద్యం షాపులు బంద్ అయిన సంగతి అందిరికి తెలిసిందే. ఇంక మందు బాబుల కష్టాలు ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. మందు కోసం వారి పాట్లు అంత ఇంత కాదు. ఇలాంటి సమయంలో వైన్ షాపులు తెరుస్తారని వార్తలు

నక్షత్ర తాబేలు అప్పగింత

Tags: Swarni, Inspector of Weights and Measures Branch at SP Superstore, Anantapur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *