స్వ‌రూప‌… నువ్వు సూప‌ర్

Date:18/09/2020

బెంగ‌ళూర్ ముచ్చట్లు:

సాధారణంగా ఏదైనా ఒక చేతితో రాయడం అలవాటు అయితే దాంతోనే రాస్తూ ఉంటారు. కొందరు రెండు చేతులతో కూడా రాస్తూ ఉంటారు. చాలా అరుదుగా రెండు చేతులతో రాసే వారు ఉంటారు. ప్రముఖ జీనియస్ ఆల్బర్ట్ ఐన్ స్టైన్ అలాంటి వ్యక్తే..! తాజాగా 16 సంవత్సరాల కర్ణాటక అమ్మాయి ఆ అరుదైన ఘనతను సాధించింది. రెండు చేతులతో ఒకేసారి రాస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఆ అమ్మాయి పేరు ఆది స్వరూప.. ఇప్పటికే ఆమె పేరు మీద రెండు రికార్డులు ఉన్నాయి.. గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఆమె మీద ఉంది. స్వరూప ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఒకేసారి రెండు చేతులతో రాయగలదు. అంతేకాకుండా తనలో సింగింగ్, మిమిక్రీ ట్యాలెంట్స్ ఉన్నాయని చెబుతోంది. ప్రాక్టీస్ తోనే తన కుమార్తె ఈ అరుదైన రికార్డును సాధించగలిగిందని స్వరూప తల్లి చెబుతోంది. ఒక్క నిమిషంలో రెండు చేతులను ఉపయోగించి 45 పదాలను రాయగలదు స్వరూప.తాను మల్టీ ట్యాలెంట్ ఉన్న అమ్మయినని.. ఎన్నో జాతీయ, ప్రపంచ రికార్డులను సాధించాలని అనుకుంటూ ఉన్నానని చెబుతోంది. రూబిక్స్ క్యూబ్, మ్యూజిక్, మిమిక్రీ విభాగాల్లో రాణించాలని అనుకుంటూ ఉన్నానని తెలిపింది స్వరూప. త్వరలో తన రెండు చేతులతో మరిన్ని పదాలను రాయాలని అనుకుంది. ఆగష్టు 14న బరేలీకి చెందిన లతా ఫౌండేషన్ స్వరూపకు ఎక్స్ క్లూజివ్ వరల్డ్ రికార్డు అవార్డును అందించింది. 40-45 పదాలను నిమిషంలో ఆమె అవలీలగా రాస్తోంది. త్వరలో నిమిషానికి 55-60 పదాలు రాస్తానని స్వరూప చెబుతోంది.ఇప్పటికే రూబిక్స్ క్యూబ్ విషయంలో పలు సంచనాలను సృష్టిస్తున్న స్వరూప తన పేరు మీద 10 ప్రపంచ రికార్డులను సృష్టించాలని భావిస్తోంది. స్కూల్ కు వెళ్లకుండానే స్వరూప ఎస్ఎస్ఎల్సి బోర్డు పరీక్షలను రాసుకుని వస్తోంది. తమ కుమార్తె సాధిస్తున్న రికార్డులకు గోపాద్కర్, సుమంగళ సుమాద్కర్ దంపతులు తెగ ఆనందిస్తూ ఉన్నారు. తన ఎదుగుదలకు తల్లిదండ్రులే కారణమని స్వరూప చెబుతోంది. ఏది ఏమైనా ఈ అమ్మాయి ట్యాలెంట్ ను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు.

హుండీలో భారీగా రద్దైన నోట్లు

Tags: Swaroop … you are super

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *