ఉత్తరాఖండ్ సీఎంతో స్వాత్మానందేంద్ర సరస్వతి భేటీ

Date:13/01/2021

డెహ్రాడూన్  ముచ్చట్లు:

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి భేటీ అయ్యారు. హరిద్వార్ కుంభమేళాలో పీఠం చేపడుతున్న సేవలను సీఎంకు  స్వామీజీ వివరించారు. స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ చార్ ధామ్ క్షేత్రాల్లో నిత్యం వేద పారాయణ చేపట్టాలి. ఉత్తర భారతదేశంలో వేద విద్యభ్యాసానికి ప్రాధాన్యత తక్కువగా ఉంది. ఉత్తరాఖండ్ లో వేద పాఠశాల ఏర్పాటుకు విశాఖ శ్రీ శారదాపీఠం సుముఖం. డెహ్రాడూన్ లో స్థలం కేటాయిస్తే సాధువులు, సామాన్యుల కోసం కంటి ఆసుపత్రిని నిర్మిస్తాం. కంటి వైద్య సేవలు, ఆపరేషన్లు ఉచితంగా అందిస్తాం.ఏటా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షను ఉత్తరాఖండ్ లోనే చేపడతారని అన్నారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags: Swatmanandendra Saraswati meets Uttarakhand CM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *