Natyam ad

దుబ్బాక  బరి కోసం కత్తి కార్తీక ప్రయత్నాలు

మెదక్ ముచ్చట్లు:
దుబ్బాక స్థానంపై బిగ్ బాస్ ఫేం, ప్రముఖ యాంకర్ కత్తి కార్తీక కన్నేసింది. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు బంధువైన కత్తి కార్తీక గతంలో దుబ్బాకలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇందుకోసం పక్కా ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే దుబ్బాకలో ఓ నివాసం ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు రెడీ అవుతుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. తన ప్రణాళికలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులను కలవగా.. అతి త్వరలోనే కత్తి కార్తీక ఏదో ఒక పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆమె మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి చెందిన కత్తి కార్తీక దుబ్బాక రాజకీయాల్లో అడుగు పెట్టనుందా అంటే దాదాపు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన స్థానం నుండే మరలా పోటీచేయాలని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో మరో ఏడాది, ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటి నుండే దుబ్బాకలో తన ప్రచారాన్ని మొదలు పెట్టాలని, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తనదైన శైలిలో రాణించాలని చూస్తుంది.
 
 
 
ఇందుకోసం తనకంటూ గుర్తింపు కోసం ప్రత్యేక ప్రణాళికలు రెడీ చేసుకుంటుందని వినికిడి. దుబ్బాకలో ఎలాగైనా పాగా వేయాలనుకుంటున్న బిగ్ బాస్ ఫేం కత్తి కార్తీక త్వరలోనే దుబ్బాకలో ఒక స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకోనుందని సమాచారందుబ్బాక దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో 2020 లో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే బిగ్ బాస్ ఫేం మొదట స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమెకు ఫార్వార్డబ్లాక్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బహుజనుల కోసం పోరాడుతా, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా, తాను స్వయాన లండన్ లో ఆర్కిటెక్ చేశాను ప్రచారం చేసుకున్నారు. తనకు గ్రామాల్ని ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై అవగాహన ఉంది, తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే దుబ్బాకను అభివృద్ధి చేస్తానంటూ.. ప్రచారం బాగానే చేసింది. కానీ దుబ్బాక ఉప ఎన్నిక ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగడంతో కత్తి కార్తీకకు స్వల్ప ఓట్లు వచ్చాయి. నోటా కంటే కాస్త అటు ఇటుగా 319 ఓట్లు వచ్చాయి.
 
 
 
ఈ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.తెలంగాణ యాస భాష పై పట్టుండటం, రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో పలు పార్టీలు కత్తి కార్తీకను తమ పార్టీలోకి చేరాలంటూ ఆహ్వానిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి తర్వాత జీహెచ్ఎంసీ సమయంలో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలవడం తో బీజేపీలో చేరుతుందంటూ అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ మధుయాష్కిని కలవడంతో బీజేపీ కాకుండా కాంగ్రెస్ లో చేరుతుందంటూ కూడా బాగానే ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు అధికారికంగా ఆమె ఏ పార్టీలో చేరలేదు. అయితే దుబ్బాకలో పర్యటించాలనుకుంటున్న కార్తీక త్వరలోనే కాంగ్రెస్ లేదా బీజేపీ ఏదో ఒక పార్టీలో చేరనున్నట్టు సమాచారం. అన్ని కుదిరితే టీఆర్ఎస్‌లో కూడా చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు వినికిడి. ఇప్పటికే కాంగ్రెస్ లో చెరుకు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు మరోసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీగా ఉన్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి సోలిపేట కుటుంబమా లేక మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి యా అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటువంటి వేళ కత్తి కార్తీక ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లో చేరుతుందా లేక ఇతర పార్టీలలో చేరుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Sword Karthik attempts for Dubaka Buri

Leave A Reply

Your email address will not be published.