-గ్రామస్థుల ఎదురుదాడి…
Date:23/01/2021
నల్గోండ ముచ్చట్లు:
నల్లగొండ జిల్లాలో.. కారులో తల్వార్లు పెట్టుకొని తిరుగుతున్న నలుగురు యువకులకు దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చండూరు మండలం, పుల్లెంల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు రోజుల కిందట.. ఉదయం 11 గంటల సమయంలో.. ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడు.. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించి కారులో తిరుగుతూ గ్రామంలో హల్ చల్ చేశారు. ఓ ఇంటి ముందు కారు ఆపేసి.. ఓ యువకుడు మద్యం మత్తులో ఇంటి గేటు బయట మూత్రవిసర్జన చేశాడు. ఇదేంటని ప్రశ్నించినందుకు ఇంటి యజమానిపై.. కారులోంచి ఓ కత్తి తీసుకుని దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భయాందోళనకు గురైన ఇంటి యజమాని.. చుట్టుపక్కల వాళ్ళని పిలవడంతో అదే కారులో పరార్ అయ్యేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులంతా కర్రలు తీసుకొని కారు వెంట దాదాపు ఐదు వందల మీటర్ల దూరం పరిగెత్తారు. దీంతో.. భయపడిన యువకులు కారుని వేగంగా పోనీ ఇచ్చే క్రమంలో.. అదుపుతప్పి రోడ్డు దిగి చెట్ల ప్రజల్లోకి దూసుకెళ్లింది. రాళ్లు కర్రలతో కారుపై దాడి చేశారు గ్రామస్తులు. ఈ లోపు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని.. కారులో ఉన్న కత్తులు తల్వార్లతో స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags:Swords, daggers in the car .. young people intoxicated with alcohol