సక్షేమానికి తూట్లు

Date:10/08/2018
అనంతపురం ముచ్చట్లు:
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. చాలీచాలని భోజనం..నాణ్యత లేని కూరలు విద్యార్థులకు దిక్కవుతున్నాయి. ముఖ్యంగా వసతిగృహాల్లో సిబ్బంది లేమి విద్యార్థులకు ప్రతిబంధకంగా మారుతోంది. భోజనం వండి వడ్డించేవారు కరవవడంతో విద్యార్థులు సైతం అన్ని పనులూ చేయాల్సి వస్తోంది. ప్రతి వంద మంది విద్యార్థులకు ఒక వంట మనిషి, ఒక సహాయకుడు, వాచ్‌మేన్‌ ఉండాల్సి ఉండగా పలు చోట్ల అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో కొన్ని చోట్ల రాత్రిపూట వాచ్‌మేన్‌ కూడా ఉండక పోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో గ్రామ శివార్లలో హాస్టళ్ల నిర్మాణాన్ని చేపట్టగా వీరికి తగిన భద్రత లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.ప్రధానంగా సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్న వసతిగృహాల్లో కొన్ని చోట్ల రోజువారీ వేతనంతో పనులకు వంట చేసేందుకు కూలీలను నియమించుకుంటున్నారు.దీనికితోడు వంట వండేందుకు  గ్యాస్‌ కనెక్షన్లు, వంటశాలలో అందుబాటులే లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 16 గిరిజన సంక్షేమ గురుకుల వసతిగృహాలు, 93 ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో ఈ సమస్య అధికంగా ఉంది. దీంతో ఆయా వసతి గృహాల్లో విద్యార్థులు నాణ్యత లేని భోజనం తింటూ వ్యాధులబారిన పడుతున్నారు.ఈ పరిస్థితిలో సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వసతిగృహాల్లో సమస్యలు పరిష్కరించాల్సిన అవసరముంది.ఈ విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సరస్వతి దృష్టికి తీసుకెళ్లగా గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వంటశాలల మరమ్మతులు చేపట్టేందుకు  చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సిబ్బంది కొరతపై కూడా ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఈ సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని చెప్పారు.వాచ్‌మేన్‌ ఉండాల్సి ఉండగా పలు చోట్ల అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో కొన్ని చోట్ల రాత్రిపూట వాచ్‌మేన్‌ కూడా ఉండక పోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో గ్రామ శివార్లలో హాస్టళ్ల నిర్మాణాన్ని చేపట్టగా వీరికి తగిన భద్రత లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్న వసతిగృహాల్లో కొన్ని చోట్ల రోజువారీ వేతనంతో పనులకు వంట చేసేందుకు కూలీలను నియమించుకుంటున్నారు.దీనికితోడు వంట వండేందుకు  గ్యాస్‌ కనెక్షన్లు, వంటశాలలో అందుబాటులే లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 16 గిరిజన సంక్షేమ గురుకుల వసతిగృహాలు, 93 ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో ఈ సమస్య అధికంగా ఉంది. దీంతో ఆయా వసతి గృహాల్లో విద్యార్థులు నాణ్యత లేని భోజనం తింటూ వ్యాధులబారిన పడుతున్నారు.ఈ పరిస్థితిలో సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వసతిగృహాల్లో సమస్యలు పరిష్కరించాల్సిన అవసరముంది.
Tags: Tactics for Testimony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *