తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ సమీపంలోని పొలాచీలో ఈనెల 7 నుంచి 11 వరకు జరిగిన జాతీయస్థాయి స్కేటింగ్ పోటీలలో తాడేపల్లి డోలాస్ నగర్ కు చెందిన మెరుగుపాల హశిష్ రెండో స్థానం సాధించి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. అండర్ 14 జూనియర్ విభాగంలో హశిష్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో సిల్వర్ మెడల్ సాధించారు. ఆర్టిస్టిక్ స్కేటింగ్ విభాగంలో ఆరు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో హశిష్ సిల్వర్ మెడల్ సాధించారు. విద్యార్థి హశిష్ కుంచనపల్లి అరవింద సీబీఎస్ఈ లో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థి హశిష్ ను కోచ్ సత్యనారాయణ, స్కూలు యాజమాన్యం అభినందించారు.
Tags: Tadepalli student Hasish won national level silver medal in skating…