ఇంటి టెర్రాస్ పై 40 రకాల మామిడి పండ్లు

Date:21/05/2019

 

తిరువనంతపురం ముచ్చట్లు:

ఇంటి టెర్రాస్‌పై మొక్కలు పెంచడం సాధారణమే. కొందరైతే రకరకాల మొక్కలతో మిద్దెను అందమైన బృందావనంలా మార్చేస్తారు. అయితే, కేరళాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన ఇంటి టెర్రాస్‌ను చిన్న సైజు మామిడి తోటగా మార్చేశాడు. 40 పైగా వెరైటీ మామిడి పండ్లను పండిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అతని పేరు జోసఫ్. ఫోర్ట్ కోచిలో నివసిస్తున్న జోసఫ్‌కు మొక్కలంటే ప్రాణం. దీంతో తన ఇంటి టెర్రాస్‌నే గార్డెన్‌లా మార్చేసుకున్నాడు. కేవలం 4 అడుగుల ఎత్తు ఉండే 200 మామిడి మొక్కలను పెంచడం మొదలుపెట్టాడు. ఇవి చూసేందుకు చిన్న మొక్కల్లా ఉన్నా.. సీజన్ రాగానే మామిడి పండ్లతో నిండుగా కనిపిస్తాయి… ‘‘వీటికి పెద్దగా నీళ్లు కూడా అవసరం ఉండదు. మొక్కలకు అంటు కట్టడం ద్వారా ఒకే చోట అన్ని రకాల వెరైటీలను పండించడం సాధ్యమైంది. ఒక్క మామిడి చెట్టు నుంచి నాకు రూ.600 నుంచి రూ.4000 ఆదాయం వస్తోంది. అది మామిడిపండు రకంపై ఆధారపడి ఉంటుంది. మొక్కల పెంపకానికి అవసరమైన సమాచారాన్ని యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుసుకుంటున్నా. ఈ వెరైటీల్లో ‘పెట్రిసియా’ అంటే ఇష్టం. దీన్ని 22 ఏళ్ల నుంచి పెంచుతున్నాను. పెట్రిసియా అనేది నా భార్య పేరు. ఇతర రకాల కంటే ఇది 35 శాతం తియ్యగా ఉంటుంది.

 

 

 

 

మీకు మార్కెట్లో కూడా ఈ వెరైటీ దొరకదు. కేవలం నా టెర్రాస్‌పైనే లభిస్తుంది’’ అని తెలిపారు. ‘‘టెర్రాస్‌పై పెంచినంత మాత్రాన్న ఆ మొక్కలకు పోషకాలు అందవని భావిస్తే పొరపాటే. ఆ లోటు లేకుండా నేను వాటికి అవసరమైన నీటిని ఆక్వాపోనిక్ విధానంలో అందిస్తున్నాను. ఇందులో నైట్రేట్, పీహెచ్ స్థాయిలు సమగ్రంగా ఉంటాయి. ఇంకా, నైట్రోజన్ – పాస్పరస్ – పొటాషియం ఎరువులను ఉపయోగిస్తున్నా’’ అని జోసెఫ్ పేర్కొన్నారు. చూశారుగా.. మీకు కూడా మొక్కల పెంపకంపై ఆసక్తి ఉంటే జోసఫ్‌లా ప్రయత్నించి చూడండి.

బాబుపై విజయసాయి సెటైర్లు

Tags: 40 types of mango berries on terrace of home