నాలుగోసారి ఓడిపొయిన సోమిరెడ్డి

Date:23/05/2019

నెల్లూరు  ముచ్చట్లు:

తొందరపడి ఓ కోయిల ముందే కూసిందన్నాడో సినీ కవి. పాపం టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిస్థితి ఇలాగే ఉంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సోమిరెడ్డికి వరుసగా నాలుగోసారి ఓటమి తప్పలేదు. 2022 వరకు పదవిలో కొనసాగే అవకాశం ఉన్నా.. గెలుపుపై ధీమాతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో 5వేలు పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కాకాణి చేతిలో సోమిరెడ్డి ఓడిపోవడం ఇది రెండోసారి కావడం విశేషం. సర్వేపల్లి నియోజకవర్గం విషయానికొస్తే.. 1989లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన చిత్తూరు వెంకట శేషారెడ్డి ఘన విజయం సాదించారు. తర్వాత 1994, 1999లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత నుంచి చంద్రమోహన్‌రెడ్డిని దురదృష్టం వెంటాడింది. 2004, 2009లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.

 

 

 

 

 

తర్వాత కాంగ్రెస్ కనుమరుగుకాగా.. వైసీపీ పుంజుకుంది. తర్వాత సోమిరెడ్డి 2012లో జరిగిన కొవ్వూరు ఉప ఎన్నికలో పోటీచేసి మళ్లీ ఓడారు. తర్వాత 2014
ఎన్నికల్లో మరోసారి సర్వేపల్లి నుంచి బరిలోకి దిగగా.. వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్‌రెడ్డి చేతిలో పరాజయం ఎదురయ్యింది. తర్వాత సోమిరెడ్డిని ఎమ్మెల్సీని చేసి.. కేబినెట్‌లో బెర్త్ ఇచ్చారు చంద్రబాబు. అయితే ఎన్నికలకు ముందు ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పాపం కానీ సీన్ రివర్స్ కావడంతో మళ్లీ ఓటమిపాలయ్యారు. సోమిరెడ్డి 2016లో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2022 వరకు ఉండగా.. వ్యవసాయశాఖ మంత్రిగా కూడా ఉన్నారు.

 

చంద్రబాబుకు భారీగా తగ్గన మెజార్టీ

Tags: Somari Reddy lost for the fourth time