యువకుడిని ఢీకొన్న కారు

Date:20/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఆతివేగంగా వస్తున్న కారు రోడ్డుపై నడుచుకుని వస్తున్న యువకుడిని ఢీకొని కారు రోడ్డు ప్రక్కన పడిన సంఘటన సోమవారం జరిగింది. గుడి సెబండకు చెందిన సురేష్‌(24) నడుచుకుని పుంగనూరు నుంచి ఇంటికి వెళ్తుండగా పలమనేరు నుంచి వనమలదిన్నెకు వెళ్లేందుకు ఎదురుగా వస్తున్న కారు అతివేగంగా వచ్చి సురేష్‌ను ఢీకొంది . ఈ ప్రమాదంలో సురేష్‌కు ముఖంపై, శరీరంపైన తీవ్ర రక్త గాయాలైంది.వెంటనే గ్రామస్తులు బాధితున్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ మేరకు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

A young man was a collision

 

 

ఫిజియోథెరపి కేంద్రం ప్రారంభం

Tags: A young man was a collision