తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు కదలిక

Date:14/08/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రానున్న సాధారణ ఎన్నికలకు ముందే జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం

భావిస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మూలో 7 సీట్లు పెంచాల్సి ఉండగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిక్కింలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ప్రచారం

జరుగుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగానే అసెంబ్లీ స్థానాల పెంపు ఉంటుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత

జనాభాకు అనుగుణంగా ఏపీలో ప్రస్తుతం ఉన్న స్థానాలను 175 నుంచి 225 పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో ఉన్న 119 స్థానాలను 153కు పెంచాలని విభజన చట్టంలో

పొందుపరిచారు. దీంతో రాష్ట్రం విడిపోయిన దగ్గరనుంచి అసెంబ్లీ సీట్లు పెంచాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.అయితే ఈ అంశంపై అప్పుడప్పుడు పార్లమెంటులో కేంద్ర

ప్రభుత్వం స్పందిస్తూనే ఉంది. 2024 వరకు సీట్ల పెంపు ఉండదని పలుమార్లు తెగేసి చెప్పింది. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేయడం, ఆర్టికల్ 3 ప్రకారం జమ్మూ కాశ్మీర్

నుంచి లడక్ ను విభజించడం జరిగిపోయాయి. జమ్మూకాశ్మీర్ లో చట్ట ప్రకారం ప్రస్తుతం 107గా ఉన్న సీట్ల సంఖ్యను 114కు పెంచుతామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం చర్చించింది.

విభజన చట్టం- సీట్ల పెంపు ప్రతిపాదనలు అందగానే ఈసీ తన ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. ఇక పనిలో పనిగా తెలుగు రాష్ట్రాల సీట్లను కూడా పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎలాగో ఏపీ విభజన చట్టంలో పెంపు అంశం పొందుపరిచారు కాబట్టి దీనిపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే జమ్మూకాశ్మీర్ తోపాటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చదువు కావాలంటే 3 కిలోమీటర్లు నడవాల్సిందే

Tags: Seat increase movement in Telugu states