ఏపీ పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Date:13/07/2019

విజయవాడ  ముచ్చట్లు:

ఏపీలో పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 17 నుంచి 29 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేలమంది విద్యార్థులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం   విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. ఇతర వెబ్సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. ఏపీలో జూన్ 17 నుంచి 29 వరకు పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 40 వేలమంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

శ్రీకాళహస్తిలో ఘనంగా ఆర్జున ఘట్టం  

Tags: AP Releases Supplementary Results