పర్యావరణ కాలుష్యాన్ని నివారించండి

– మెప్మా పీడీ నాగజ్యోతి

 

Date:25/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు తమ ఇండ్ల వద్ద, ఖాళీ స్థలాల్లో వెహోక్కలు పెంచాలని మెప్మా పీడీ నాగజ్యోతి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని సంకల్ప సోసైటి వారి ఆధ్వర్యంలో వెహోక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా పీడీ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని నివారించకపోతే పెను ప్రమాదాలు సంబవిస్తుందన్నారు. ఇందుకు గాను ప్రతి ఒక్కరు ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేదించాలన్నారు. అలాగే వెహోక్కలు నాటడం చేపట్టాలన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటి పరిధిలో హ్గం కంపోస్ట్ విధానాన్ని అమలు పరుచుకోవాలని సూచించారు. ఇందుకోసం డస్ట్ బిన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా కో-ఆర్డినేటర్‌ రవి, సీవోలు మయూరి, జయంతి, సంకల్ప సోసైటి సభ్యులు కుమారి, రాజా, జానకి తో పాటు టౌన్‌ సభ్యులు పాల్గొన్నారు.

 

అక్షరాస్యులుగా మారి చట్టాలను అవగాహన చేసుకోవాలి

Tags: Avoid environmental pollution

పర్యావరణ కాలుష్యాన్ని నివారించండి

-ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Date:01/08/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని ప్రజలందరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో వనం-మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పట్టణ ప్రజలకు, కళాశాలల విద్యార్థులకు 20 వేల వెహోక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే పట్టణంలో 15 వేల మొక్కలను పెంచడం జరిగిందన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు పెంపంకం ప్రతి ఒక్కరు చేపట్టాలన్నారు. అలాగే పట్టణంలో చెత్తను తొలగించే స్వీపింగ్‌ మిషన్‌ను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్లు అమ్ము, మనోహర్‌, ఇబ్రహిం, ఆసిఫ్‌, నయాజ్‌, రేష్మ, మంజుల, వైఎస్సాఆర్సీపి నాయకులు రెడ్డెప్ప, వెంకటరెడ్డి యాదవ్‌, జయరామిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఇఫ్తికార్‌, కిజర్‌ఖాన్‌, యువజన సంఘ నాయకులు రాజేష్‌, కుమార్‌, సురేష్‌, హేము, జెపి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ కాలుష్యాన్ని నివారించండిhttps://www.telugumuchatlu.com/avoid-environmental-pollution-2/

Tags; Avoid environmental pollution

పర్యావరణ కాలుష్యాన్ని నివారించండి

– న్యాయమూర్తులు భారతి, రమణారెడ్డి పిలుపు

Date:05/06/2018

పుంగనూరు ముచ్చట్లు:

పర్యావరణ కాలుష్యాని నివారించి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలని పుంగనూరు ప్రిన్సిపుల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి భారతి, అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి రమణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోర్టు ఆవరణంలో న్యాయవాదులు, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌తో కలసి వెహోక్కలు నాటారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజం కాలుష్యం భారిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చోట ప్లాస్టిక్‌ వినియోగంతో పాటు వృక్షాలు , అడవులు నశించిపోతున్నాయని తెలిపారు. దీని కారణంగా కాలుష్యం తీవ్రమై , మానవాలి మనుగడకు విఘాతం ఏర్పడిందన్నారు. వీటి నుంచి ప్రజలను పరిరక్షించుకునేందుకు కాలుష్య రహిత సమాజాన్ని ఏర్పరచుకునేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ నేతలు రెడ్డెప్ప, మల్లికార్జునరెడ్డితో పాటు న్యాయవాదులు శివశంకర్‌నాయుడు,ప్రభాకర్‌నాయుడు, ఆకుల చెన్నకేశవులు, పులిరామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Avoid environmental pollution