సోదరుడికి రక్త తర్పణం

Date:12/07/2019

చెన్నై ముచ్చట్లు:

ప్రస్తుత సాంకేతిక యుగంలోనూ పగలు, ప్రతీకారాలు బుసలుకొడుతూనే ఉన్నాయి. తమిళనాడులో రెండ్రోజుల క్రితం జరిగిన ఓ ప్రతీకార హత్య సంచలనం సృష్టిస్తోంది. కొన్ని మాసాల క్రితం తన సోదరుడిని హత్య కేసిన వ్యక్తిని వేట కొడవళ్లతో నరికిచంపి…సోదరుడి సమాధికి రక్త తర్పణం చేసిన ఘటన మదురైలో చోటుచేసుకుంది. తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాన్నట్లు హంతకుడు వాట్సప్ గ్రూప్‌లో ఆడియో పోస్టింగ్స్ చేయడంతో హత్య కేసును పోలీసులు ఛేదించారు.శివగంగ జిల్లాలో ఓ వ్యక్తి గత ఏడాది మే నెలలో దారుణ హత్యకు గురైయ్యాడు. ఈ హత్య కేసులో ప్రమేయమున్నట్లు అనుమానిస్తూ ప్రశాంత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

 

 

 

 

మదురై సెంట్రల్ జైల్లో కొన్ని రోజుల పాటు గడిపిన ప్రశాంత్…20 రోజుల తర్వాత ఫిబ్రవరి మాసంలో బెయిల్‌పై విడుదలయ్యాడు. మార్చి 18 తేదీన తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో వారి మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో ప్రశాంత్ కత్తిపోట్లతో హత్యకు గురైయ్యాడు. ప్రశాంత్‌పై కత్తితో దాడిచేసిన శివన్ మూర్తి(23)ని పోలీసులు అరెస్టు చేశారు.ఆ తర్వాత అతను షరతులతో కూడిన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. మంగళవారంనాడు కొందరు వ్యక్తులు శివన్ మూర్తిని వ్యవసాయ భూమిలో వేటకొడవళ్లతో నరికిచంపారు.

 

 

 

 

 

ప్రశాంత్ హత్యకు ప్రతీకారంగా శివన్ మూర్తి హత్య జరిగి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ వాట్సప్ గ్రూప్‌లో ప్రశాంత్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నట్లు అతని సోదరుడు ఊర్‌కావలన్ ఆడియో పోస్టింగ్స్ చేశాడు. శివన్ మూర్తిని నరికి చంపి, అతని రక్తంతో తన సోదరుడి సమాధికి రక్త తర్పణం చేశానని, ఎవరికైనా సందేహం ఉంటే సమాధి వద్దకు చూడొచ్చని ఈ ఆడియో టేపుల్లో ఊర్‌కావలన్ పేర్కొన్నాడు. ఇకనైనా తన సోదరుడి ఆత్మకు శాంతి లభిస్తుందన్నాడు.ఈ ఆడియో టేపుల ఆధారంగా శివన్ మూర్తి హత్య కేసుకు సంబంధించి ప్రశాంత్ సోదరుడు ఊర్‌కావలన్‌ను అరెస్టు చేశారు. ఈ హత్యోదంతం తమిళనాడులో సంచలనం సృష్టించింది.

రాటు దేలుతున్న పళని స్వామి

Tags: Blood transfusion to brother