ప్రజల సంక్షేమం కోసమే బడ్జెట్‌

Date:12/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నవరత్నాలను పోలిఉందని, నవరత్నాల అమలుకు రూపొందించిన బడ్జెట్‌ ప్రశంసనీయమని పలువురు మేదావులు కొనియాడారు.

చరిత్రలో న్యాయవాదులకు అగ్రస్థానం….

రాష్ట్ర చరిత్రలో ఏప్రభుత్వము న్యాయవాదుల సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయించలేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నూరుకోట్లు సంక్షేమానికి కేటాయించడం హర్షనీయం. అన్ని వర్గాలను గుర్తించి, బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది.

– కెవి.ఆనందకుమార్‌, న్యాయవాదుల సంఘ కార్యదర్శి , పుంగనూరు.

విద్యాశాఖ బలోపేతం…

రాష్ట్రంలో విద్యాశాఖకు రూ.32.618 కోట్లు కేటాయించడం ప్రసంశనీయం. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అలాగే విద్యార్థులకు స్కాలర్‌షిఫ్‌లకు రూ.4962 కోట్లు, ఉన్నత విద్య, పాఠశాలల నిర్వహణకు రూ.160 కోట్లు, మౌళిక సదుపాయలకు రూ.1500 కోట్లు కేటాయించి, ప్రభుత్వం పరిపాలనలో పారదర్శకాన్ని చాటుకుంది.

– జివి. రమణ, పిఆర్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పుంగనూరు

బడ్జెట్‌ తలమానికం….

దేశ చరిత్రలో ఎన్నికల మ్యానిఫెస్టో అమలుకు బడ్జెట్‌ను రూపొందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి , ఎన్నికల మ్యానిఫెస్టో హామిలను అమలు చేసేందుకు నవరత్నాల బడ్జెట్‌ను రూపొందించి అన్ని వర్గాలకు సమన్యాయం పాటించి, నిధులు కేటాయించడం ర్ఖా•నికే తలమానికంలాంటిది. ఇంతటి మహాత్తర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వైఎస్సార్‌సిపి ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రికి అభినందనలు .

– డాక్టర్‌ శివ, లయన్స్ క్లబ్ జిల్లా పీఆర్‌వో, పుంగనూరు

ప్రజా బడ్జెట్‌ …

వైఎస్సార్సీపి ప్రభుత్వం ప్రజా సంక్షేమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నిశాఖలను అభివృద్ధి చేసేలా బడ్జెట్‌ ప్రణాళికలను రూపొందించారు. అలాగే నవరత్నాల సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి, పేద ప్రజల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించడం హర్షనీయం.

– వరదారెడ్డి, జెఏసీ చైర్మన్‌ , పుంగనూరు

తహశీల్ధార్‌కు వీడ్కోలు

Tags: Budget for the welfare of the people