ఆర్టీసి డిపోకు వీడిన చందగ్రహణం

– మాట నిలుపుకున్న పెద్దిరెడ్డి
– ప్రారంభానికి ఏర్పాట్లు
– హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

Date:28/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

సుమారు పది సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోని ఆర్టీసి డిపోకు చందగ్రహణం వీడింది. ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్సీపి అధికారంలోకి రాగానే డిపో ప్రారంభిస్తామని హామి ఇచ్చారు. ఈ మేరకు ఆర్టీసి అధికారులు మంగళవారం డిపోను పరిశీలించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డిపోను డిప్యూటి ట్రాఫిక్‌ మేనేజర్‌ రాము, పలమనేరు మేనేజర్‌ రామక్రిష్ణ, అసిస్టెంట్‌ మేనేజర్‌ దినేష్‌లు కలసి డిపోను పరిశీలించారు. నివేదికలు పంపగానే ఆర్‌ఎం నాగశివుడు డిపోను పరిశీలించి, చర్యలు తీసుకుంటారని తెలిపారు. కాగా ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డిపో ప్రారంభానికి సిద్దమౌతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ , ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

డిపో నిర్మాణం…

పుంగనూరు నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం సుమారు రూ. 2కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆర్టీసి డిపో సుమారు పది సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోకుండ పోయింది. పట్టణంలో 30 సంవత్సరాలుగా ప్రజలు ఆర్టీసి బస్సు డిపో కోసం ధర్నాలు, దీక్షలు చేశారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ డిపో మంజూరు చేయాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని కోరారు. ఆయన తక్షణం మంజూరు చేశారు. ఈ పనులను ప్రారంభించేందుకు 2009 సెప్టెంబర్‌ 23న అప్పటి రవాణాశాఖ మంత్రి శత్రుచెర్ల విజయరామరాజు , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలసి పనులను ప్రారంభించారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆకాల మరణం తరువాత పనులు పూర్తి అయిన రాజకీయ మార్పులతో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం ఆర్టీసి డిపోను ప్రారంభించకుండ ఆపివేశారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబునాయుడు ఆర్టీసి డిపోను ప్రారంభించకుండ వ్యక్తిగత కక్షలతో పుంగనూరు అభివృద్ధిని అడ్డుకున్నారు.

నవోదయలో చైతన్య విద్యార్థుల ప్రతిభ

Tags: Cassage from the RTC Depot