వైఎస్సార్సీపి విజయంపై సంబరాలు

Date:25/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో వైఎస్సార్సీపి విజయం సాధించడం , పుంగనూరులో వైఎస్సార్సీపి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు విజయం సాధించడం పట్ల పట్టణంలోని పలు సంఘాలు సంబరాలు చేసుకున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో వాసు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి , బాణసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అలాగే కౌసర్‌ ఆసుపత్రిలో డాక్టర్‌ కౌసర్‌ , ఆమె భర్త అర్షద్‌అలి , డాక్టర్లు పవిత్రన్‌, ప్రవీన్‌ఆనంద్‌లు కలసి సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని ఆర్టీసి బస్టాండు వద్ద అంబేద్కర్‌ దళితసేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శంకరప్ప, గంగప్ప, మోహన్‌ , నారాయణ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. అలాగే చిత్తూరు ఎంపీ రెడ్డెప్పకు రజక సంఘ నాయకులు , కౌన్సిలర్‌ శోభారాణి, గంగాధర్‌, శ్రీనివాసులు, శీన ఆధ్వర్యంలో పూలమాలలు వేసి సన్మానం చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.

 

పర్యావరణ కాలుష్యాన్ని నివారించండి

Tags: Celebrating the victory of YSRCP

వైఎస్సార్సీపి విజయంపై సంబరాలు

Date:23/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో వైఎస్సార్సీపి విజయం సాధించడం , పుంగనూరులో వైఎస్సార్సీపి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు విజయం సాధించడం పట్ల పట్టణంలోని పలు సంఘాలు సంబరాలు చేసుకున్నారు. గురువారం సాయంత్రం ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, మాజీ అధ్యక్షుడు ముల్లంగి విజయకుమార్‌ ఆధ్వర్యంలో బాణసంచాలు పేల్చి సంబరాలు చేశారు. అలాగే వర్థక వ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి, కార్యదర్శి అర్షద్‌అలి, చాంబర్‌ ఆఫ్‌కామర్స్ అధ్యక్షుడు బానుప్రకాష్‌, వెంకటేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో బాణసంచాలు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు బాలచంద్ర , హరినాథ్‌జెట్టి, నూర్‌అహమ్మద్‌ లు బాణసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమాలలో ఆర్యవైశ్య సంఘ నేతలు పిఎల్‌.ప్రసాద్‌, ఆర్‌వి.బాలాజి, పిఎల్‌.శ్రీధర్‌, ప్రవీన్‌, బాబు, కాశిప్రసాద్‌, రాజన్న, సుధర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎమ్మెల్యేగా డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం

Tags: Celebrating the victory of YSRCP