వైఎస్సార్సీపి గెలుపుపై సంబరాలు

Date:26/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో వైఎస్సార్సీపి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ద్వాకరనాథరెడ్డి విజయం సాధించడంపై ఆదివారం రాత్రి పుంగనూరు వెల్‌విషర్స్గ్రూప్‌ సంబరాలు చేసుకున్నారు. గ్రూపు సభ్యులు డాక్టర్లు శివ, శరణ్‌, ప్రభాకర్‌, చైతన్యతేజారెడ్డి, కెసిటివి అధినేత ముత్యాలు, మురుగప్ప, విజయకుమార్‌, బాలసుబ్రమణ్యం, శ్రీధర్‌, బిటి అతావుల్లా ఆధ్వర్యంలో బాణసంచాలు పేల్చి , కేక్‌కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా పూర్వపు కమిషనర్‌ కెఎల్‌.వర్మ , ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడు మువ్వల నరసింహులుశెట్టి, జెఏసి చైర్మన్‌ వరదారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శివ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సేవలో నిస్వార్థంగా సేవలందిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడవ సారి పుంగనూరులో ఎమ్మెల్యేగా గెలుపొందడం హర్షనీయమన్నారు. అలాగే మిధున్‌రెడ్డి ఎంపిగా రెండవ సారి గెలవడం , ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా గెలవడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు పెద్దిరెడ్డి కుటుంబం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో త్రిమూర్తిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మహేంద్రరావు, మాజీ సైనికోద్యోగులు శ్రీనివాసులు, గణేష్‌, రామయ్య, విశ్రాంత ఉద్యోగులు రామక్రిష్ణారెడ్డి, చెంగారెడ్డి, వెంకటాచలపతిరెడ్డి, రఘుపతి, వైఎస్సార్సీపి నాయకులు జి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

జూన్ 1, 2 తేదీల్లో టిటిడి ఉద్యోగుల‌కు ఉచిత మెగా వైద్య శిబిరం : జెఈవో బి.ల‌క్ష్మీకాంతం

 

Tags: Celebrating YSRCP win