జనగణమన శత వేడుకలు

– పుంగనూరులో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
-మరో చరిత్రకు కమిటి సన్నహాలు

Date:17/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

నిత్య జాతీయ గీతాలాపనతో దేశంలోనే తొలిసారిగా ఘన చరిత్ర నమోదు చేసుకున్న పుంగనూరు పట్టణం మరో చరిత్రకు శ్రీకారం చుట్టింది. మనం ఆలపించే జాతీయ గీతం జనగణమన ఇం•ష్‌ అనువాదానికి వందేళ్లు పూరైయిన సందర్భంగా శత వేడుకలు భారీగా నిర్వహించేందుకు జనగణమన కమిటి సన్నహాలు ప్రారంభించింది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మదనపల్లెలో 1919 ఫిబ్రవరి 28న జనగణమన గీతాన్ని ఇం•ష్‌లో అనువధించారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణ జనగణమన కమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, పి.అయూబ్‌ఖాన్‌, వి.దీపక్‌, ఎన్‌.ముత్యాలు, సివి.శ్యామ్‌ప్రసాద్‌ కలసి శత జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈనెలాఖరులోపు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈ శతజయంతి వేడుకలకు పట్టణ ప్రముఖులను, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యులు చేసి , దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

లక్ష్యం ఘనం… వ్యవసాయ రుణాలు భారం

Tags: Centennial celebrations