చంద్రబాబు నేల విడిచి సాము చేశారు: సీపీఐ నేత నారాయణ

Date:24/05/2019

హైదరాబాద్  ముచ్చట్లు:

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా పార్టీలు ఓటమి పాలవడంపై సీపీఐ నేత నారాయణ విమర్శలు చేశారు. కమ్యూనిస్టు పార్టీలు కొన్ని తప్పులు చేశాయని, ఒకప్పుడు 60 స్థానాల్లో ఉన్న లెఫ్ట్, ఇప్పుడు 4 స్థానాలకు పడిపోయిందని అన్నారు. కుల, మత, ధన రాజకీయాలతో పోటీ పడలేకపోతున్నామని నారాయణ అన్నారు.ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడంపై సీపీఐ నేత నారాయణ విమర్శలు చేశారు. చంద్రబాబు నేల విడిచి సాము చేశారని, దాని ఫలితమే ఓటమి పాలయ్యారని అన్నారు. వైఎస్ జగన్ ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లారని, అందుకే ఈ విజయం ఆయనకు దక్కిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వైఖరి వల్లే తెలంగాణలో కొన్ని ఎంపీ స్థానాలను టీఆర్ఎస్
కోల్పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించీ ప్రస్తావిస్తూ, అసమర్థ నాయకత్వం వల్లే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని అన్నారు.

 

జగన్ ఘన విజయం తరువాత… ప్రశాంత్ కిశోర్ ముందు పార్టీల క్యూ!

 

Tags: Chandrababu left the floor and said: CPI leader Narayana