సోషల్ మీడియాలో జగన్ సీఎం నేమ్  బోర్డు చక్కర్లు

Date:15/04/2019
విజయవాడ ముచ్చట్లు:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విజయం ఖాయమైందా? ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారా? ఫలితాల మాట ఎలా ఉన్నా.. వైసీపీ, టీడీపీలు మాత్రం విజయం తమదే అనే ధీమాతో ఉన్నాయి. ఈ తరుణంలో ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’ అనే నేమ్ బోర్డ్ ఒకటి సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ నేమ్‌బోర్డ్ చూసిన కొంతమంది వైసీపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో వచ్చేవీ ఏవీ పూర్తిగా నమ్మలేం. ఈ నేమ్‌బోర్డును ఖచ్చితంగా వైసీపీ వారే తయారు చేయించారనే గ్యారంటీ కూడా లేదు. అలాగని కొట్టిపారేయం లేం కూడా. ఎందుకంటే.. ఈసారి ఎన్నికల్లో జగన్ తప్పకుండా సీఎం అవుతారని వైసీపీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా సన్నహాలు చేసుకోవడంలో తప్పులేదనే వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నేమ్ బోర్డును సిద్ధం చేసుకుని ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే, మే 23న ఫలితాలు వెల్లడయ్యే వరకు ఏ పార్టీ విజయం సాధిస్తుందనే విషయాన్ని చెప్పలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఏపీలో అత్యధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లు ఎటు మొగ్గారనేది సస్పెన్స్. అయితే, ఓటింగ్ సరళి అంచనాల ప్రకారం వైసీపీ శ్రేణులు తమదే విజయమని, ఈసారి జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ సంబరాలు చేసుకుంటున్నారు. 100 సీట్లకు పైనే వైసీపీ గెలుచుకుంటుందని అంటున్నారు. జగన్ కూడా ఇదే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో జగన్ తమ విజయం దాదాపు ఖరారైందని పేర్కొన్నారు. 2024లో కూడా పార్టీ విజయం కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేయాలని కోరారు. అలాగే పాలనలో కూడా తన వంతు సలహాలు, సూచనలు అందించాలన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన నేమ్‌బోర్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నిజమా? ఫేకా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Tags: Jagan’s CM name board circulates in social media

దాడులు చేస్తున్నారు

Date:04/04/2019
అమరావతి ముచ్చట్లు:
దేశంలో దుర్మార్గులంతా ఏకమయ్యారని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు అన్నారు.గురువారం  పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ… ప్రత్యర్థులపై కక్ష సాధించే లక్ష్యంగా ఏకమయ్యారన్నారు. మోడీ, కేసీఆర్, జగన్ లు ఏపీపై ముప్పేట దాడులు చేస్తున్నారన్నారు. మోడీ డైరెక్షన్ తోనే టీడీపీ నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నేతలపై పాత కేసులను కేసీఆర్  తవ్వితోడున్నారన్నారు. మరోవైపు ఐటీ దాడులతో భయాందోళనలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మైలవరంలో ఏకంగా పోలీసులపై కూడా దాడులకు తెగబడుతున్నారన్నారు.  ఇక ప్రజలపై వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. యుద్ధంలో కనీస సంప్రదాయాలు పాటిస్తారనీ, ఓటమి భయంతో వైసీపీ అన్నింటిని వదిలేసిందని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నేతల మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు.  వీళ్ల దుర్మార్గాలతో తరతరాల అభివృద్ధి ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలు పీకేస్తామని పుంగనూరులో బెదిరింపులకు పాల్పడ్డారని గుర్తుచేశారు. పొన్నూరులోనైతే స్కూల్ పిల్లల ఆటోపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారని గుర్తు చేసారు.  మైలవరంలో వైసీపీ నేతలు రణరంగం సృష్టించారని దుయ్యబట్టారు. పోలీసులు, జవాన్లపై చెప్పులు, రాళ్లతో వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సత్తా ఏంటో మోదీకి కూడా రుచి చూపించాలన్నారు.
Tags: Attacks are being done

మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెసు చేతి నుంచి జారిపోయారు

   Date:16/03/2019
  హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు దెబ్బకు తెలంగాణ కాంగ్రెసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెసు చేతి నుంచి జారిపోయారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు కానుంది.ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరగా, మరికొంత మంది కారెక్కడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వారి సంఖ్య దాదాపు పది ఉంది. శానససభ ఎన్నికల్లో కాంగ్రెసు కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష హోదాకు కనీసం 12 సభ్యులు అవసరం. పది మంది చేజారిపోవడంతో ప్రతిపక్ష హోదాకు ఎసరు వచ్చినట్లే.రేగా కాంతారావు, ఆత్రం సక్కుతో మొదలైన ఫిరాయింపు కాంగ్రెసు శాసనసభా పక్షాన్ని ఖాళీ చేసేంత వరకు కూడా ఆగేట్లు లేవు. వారి తర్వాత హరిప్రియ నాయక్ టీఆర్ఎస్ లో చేరారు. వీరు ముగ్గురు కూడా గిరిజనుల సమస్యలను ముందు పెట్టి, వాటి పరిష్కారం కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ వల్లనే సమస్యలు తీరుతాయని వారు చెప్పారు.నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరీ పట్టుబట్టి చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇప్పించుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటను కాదనలేని స్థితిలో ఆయనకు కాంగ్రెసు అధిష్టానం టికెట్ ఖరారు చేసింది.మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఎన్నికలకు ముందు నుంచే అసంతృప్తితో ఉన్నారు. తన కుమారుడికి రాజేంద్రనగర్ సీటు ఇవ్వకపోవడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. అయితే, అప్పటికప్పుడు సర్దుకుని గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.
మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఎన్నికలకు ముందు నుంచే అసంతృప్తితో ఉన్నారు. తన కుమారుడికి రాజేంద్రనగర్ సీటు ఇవ్వకపోవడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. అయితే, అప్పటికప్పుడు సర్దుకుని గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మాట తీరు గెలిచినప్పటి నుంచి కాస్తా అనుమానాస్పదంగా కనిపిస్తూ వచ్చింది. కేసీఆర్ ను, కేటీఆర్ ను ప్రశంసిస్తూ వచ్చారు. అయినా తాను టీఆర్ఎస్ లోకి వెళ్లనని చెబుతూనే అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి కూడా రేపో మాపో కారెక్కే అవకాశాలున్నాయి. ఆయన కేటీఆర్ ను కలిశారు. సమస్యల మీద కలిసినట్లు చెబుతూనే టీఆర్ఎస్ లోకి జంప్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.జాజుల సురేందర్, ఉపేందర్ రెడ్డి కూడా కారెక్కడానికి సిద్ధపడ్డారు. వనమా వెంకటేశ్వర రావు కూడా అదే దారిలో ఉన్నారు. మరింత మంది కూడా టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.పార్టీ ఫిరాయింపులతో శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాలు ప్రశ్నార్థకంగా మారాయి. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి శాసనసభ్యులు వారికి సహకరించే అవకాశం కూడా లేదు.
Tags: Rose Operation Congress Paresh