మంత్రి పెద్దిరెడ్డిచే పుంగనూరులో అభివృద్ధి పరుగులు

– ఎంపీడీవో , తహశీల్ధార్‌ కార్యాలయాలకు మహర్ధశ
– నూతన భవనాలకు రూ.6.10 కోట్లు

Date:25/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా నియమితులైన డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనదైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, పులిచెర్ల, చౌడేపల్లె, సోమల, సదుం మండలాలకు ప్రత్యేకంగా రూ.6.10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా పుంగనూరు ఎంపీడీవో కార్యాలయాన్ని , తహశీల్ధార్‌ కార్యాలయాన్ని ఒకే భవనంలో ఏర్పాటు చేసేలా మంత్రి పెద్దిరెడ్డి ప్రణాళికలు సిద్దం చేశారు. ప్రస్తుత ఎంపీడీవో కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్‌ మండల కాంప్లెక్స్ రూ.2.60 కోట్లతో నిర్మించనున్నారు. అలాగే పులిచెర్ల మండలంలో రూ.2.60 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్ను, చౌడేపల్లె మండల కాంప్లెక్స్ సమావేశ మందిరానికి రూ.30 లక్షలు, సోమల మండల కాంప్లెక్స్ సమావేశ మందిరానికి రూ.30లక్షలు, సదుం మండల కాంప్లెక్స్ సమావేశ మందిరానికి రూ.30 లక్షలు కేటాయించారు. ఈనెల 21న పంచాయతీరాజ్‌ సెక్రటరీ గోపాలకృష్ణద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం రూ.6.10కోట్లతో పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ మేరకు తక్షణం ఇంజనీరింగ్‌ అధికారులు పనులకు ఎస్టిమేట్లు తయారు చేసి, పనులు చేపట్టాలని ఆదేశించారు.

భవన నిర్మాణాలు…

మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం 1980 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి ప్రారంభించారు. ఈ భవనాలు శిధిలావస్థకు చేరుకోవడంతో మంత్రి నూతన భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. మండల కార్యాలయాన్ని తొలగించి, ఈ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్‌ మండల కాంప్లెక్స్ రెండస్తుల సముదాయాలతో నిర్మిస్తారు. ఇందులో ప్రజలకు అనువుగా ఉండేలా తహశీల్ధార్‌ కార్యాలయాన్ని కూడ పై అంతస్తులో ఏర్పాటు చేయనున్నారు. రూ.2.60 కోట్లతో ఆధునాతన వసతులతో పనులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు మంత్రి చర్యలు చేపట్టారు. ఇదే విధంగా పులిచెర్ల మండలంలో కూడ ఇంటిగ్రేటెడ్‌ మండల కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఈ విషయమై ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు మాట్లాడుతూ భవన నిర్మాణాలను త్వరలోనే చేపడుతామని తెలిపారు.

సచివాలయ ఉద్యోగుల అభ్యర్థులకు అవగాహన సదస్సు

Tags: Development runs in Punganur by Minister Peddi Reddy

మధ్యంషాపుల అద్దె భవనాలకు టెండర్లు ఆహ్వానం

Date:18/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం నిర్వహించే మధ్యంషాపులకు అద్దె భవనాలను సేకరించేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి ఆదివారం విలేకరులకు తెలిపారు. ప్రభుత్వాదేశాల మేరకు పుంగనూరు, రామసముద్రం, పెద్దపంజాణి , చౌడేపల్లె, సోమల, సదుం మండలాల్లో గల మధ్యం దుకాణాలను బాడుగులకు తీసుకునేందుకు టెండర్లను కోరుతున్నట్లు తెలిపారు. భవన యజమానులు ఈనెల 21 సాయంత్రం 4 గంటలలోపు టెండర్లను పుంగనూరు ఎక్సెజ్‌ కార్యాలయం బాక్సులో వేయాలన్నారు. వివరాలకు స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు షాపుల సంఖ్య, వివరాలను నిర్ణయించడం జరుగుతుందన్నారు.

ప్రతి నీటిబొట్టును వృధా చేయరాదు

Tags: Invitation of tenders to mid-sized rental buildings