సాదారణ వ్యక్తి ఎంపిగా ఎన్నిక

– చిత్తూరు ఎంపి ఎన్‌.రెడ్డెప్ప

 

Date:25/05/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

సాధారణ దళిత కుటుంబంలో జన్మించిన ఎన్‌.రెడ్డెప్ప రాజకీయ జీవితం తొలిసారిగా ఊహించని మలుపు తిప్పింది. చిత్తూరు ఎంపిగా వైఎస్సార్సీపి తరపున పోటీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడైన ఎన్‌.రెడ్డెప్పను చిత్తూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ అధిష్టానం నిలిపింది. 68 సంవత్సరాల వయసు కలిగిన రెడ్డెప్ప తొలిసారిగా విద్యాబ్యాసం పూర్తి కాగానే 1981 లోపబ్లిక్‌ ప్రసిక్యూటర్‌గా ఏడాది పాటు పని చేశారు. అలాగే ఏజిపిగా 1984 నుంచి 1987 వరకు, పని చేసి, ఎస్‌బిఐ, సప్తగిరి గ్రామీణబ్యాంకు, మున్సిపాలిటికి, ఇతర ప్రైౖ వేటు కంపెనీలకు లీగల్‌ అడ్వైజర్‌గా పని చేశారు. కేంద్ర ఉక్కుపరిశ్రమశాఖ డైరెక్టర్‌గా 2008 లో పని చేశారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడుగా 14 సార్లు పని చేశారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో రాష్ట్ర లీడ్‌క్యాప్‌ చైర్మన్‌గా రెడ్డెప్ప పని చేశారు. ప్రస్తుతం ఎంపిగా గెలుపొందారు.

పుంగనూరులో పెద్దిరెడ్డి హ్యాట్రిక్‌

Tags: Simple as an MP