కమిషనర్‌ కెఎల్‌.వర్మకు సన్మానం

Date:13/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు కమిషనర్‌గా కెఎల్‌.వర్మ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు పలువురు శనివారం ఆయనకు ఘన సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ క్షత్రియసంఘ నాయకులు రెడ్డెప్పరాజు, లక్ష్మణరాజు ల ఆధ్వర్యంలో క్షత్రియ సంఘ నేతలు పూలమాలలు వేసి, శాలువ కప్పి సన్మానం చేశారు. అలాగే రోటరీక్లబ్‌ ప్రతినిధులు డాక్టర్‌ శరణ్‌, డాక్టర్‌ జాన్‌, సురేష్‌, హరిప్రసాద్‌, సుధాకర్‌లు కమిషనర్‌ను కలసి అభినందించారు. ఉపాధ్యాయ సంఘ నేతలు సుబ్రమణ్యం ఆధ్వర్యంలో కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వస్త్రవ్యాపారుల సంఘ కార్యదర్శి అర్షద్‌అలి కమిషనర్‌ను సన్మానించారు.

జాతీయ లోక్‌అదాలత్‌లో 123 కేసులు పరిష్కారం

Tags: Commissioner KL Varma felicitated